తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ
హైదరాబాద్: తెలంగాణ దేవాదాయ శాఖను ప్రక్షాళన చేసి నిజాయితీ పరులైన అధికారులను నియమించాలని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ కోరారు. సమాఖ్య రాష్ట్ర ప్రధానకార్యదర్శి నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచారి అధ్యక్షతన ఆదివారం నగరంలో సమాఖ్య విస్తృత సమావేశం జరిగింది. గ్రామప్రాంతాల్లో పనిచేస్తున్న అర్చకులకు ధూప, దీప, నైవేద్యం పథకం కింద ఇస్తున్న మొత్తాన్ని పెంచాలని కోరారు.
ఏపీ ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.920 కోట్లు వెంటనే చెల్లించే విధంగా స్థానిక టీడీపీ, బీజేపీ నేతలు కృషి చేయాలని కోరారు.విభజన చట్టం ప్రకారం టీటీడీ రూ.583కోట్లు, విజయవాడ కనకదుర్గ, శ్రీశైలం మల్లికార్జున తదితర 16 పెద్ద దేవాలయాల నుంచి రూ.337కోట్లు తెలంగాణకు కామన్‌గుడ్ ఫండ్, అర్చక వెల్ఫేర్ ఫండ్‌కు జమచేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ లో 12,260 దేవాలయాల అభివృద్ధికి, అర్చక సంక్షేమానికి రూ.100కోట్లు కేటాయిం చాలన్నారు. తెలంగాణ దేవాదాయశాఖలో ఉద్యోగ ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
దేవాదాయ శాఖను ప్రక్షాళన చేయాలి
Published Mon, Dec 22 2014 3:05 AM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM
Advertisement