
Today Gold and Silver Prices: ఆల్‌టైంహైనుంచి దిగివచ్చిన వెండి బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. ముఖ్యంగా శ్రావణమాసంలో బంగారు ఆభరణాలకు డిమాండ్ పెరగనున్న నేపథ్యంలో వరుస సెషన్లుగా పెరుగుతూ వస్తున్న ధరలు వినియోగ దారులను నిరాశ పరుస్తున్నాయి. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కూడా పసిడి, వెండి ధరలు పరుగందుకున్నాయి.
హైదరాబాద్‌లో బంగారం ధరలు(ఆగస్టు 24,గురువారం) 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.220 పెరిగి రూ.59,450 ధరకు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.200 పెరిగి రూ.54,500 పలుకుతోంది. ఇక వెండి అయితే ఏకంగా 1500 రూపాయలు ఎగిసి తిరిగి 80వేల రూపాయిల స్థాయికి చేరుకుంది. దాదాపు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి కూడా జోరందుకుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగార ధరల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!
గ్లోబల్‌గా ఎలా ఉన్నాయంటే..
అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1922 డాలర్ల దగ్గర ఘుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధర 24 డాలర్లకు ఎగువన 24.26 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది.