కుటుంబాల్లో అన్నాచెలెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ఉండే బంధానికి ఉన్న ప్రత్యేకతే వేరు. వీరి ప్రేమానురాగాలకు సూచనగా జరుపుకునే పండుగ రక్షా బంధన్. రాఖీ అంటే రక్షణ. నీకు నేనున్నాననే భరోసా ఇచ్చే అపురూప బంధం. తన తోడబుట్టిన వాడు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ ఆడబిడ్డలు కట్టేదే ఈ రాఖీ.
అలాగే సదా నీకు రక్షగా ఉంటానంటూ అన్నదమ్ములు హామీ ఇవ్వడం ఆనవాయితీ. అయితే, అత్యంత సంబరంగా చేసుకునే ఈ వేడుకలో అన్నా తమ్ములకు రాఖీ కట్టడంతోపాటు మరిన్ని విధాలుగా ఈ పండుగను జరుపుకుంటారు. ఆ విషయాలేంటో తెలుసుకుందాం..
Comments
Please login to add a commentAdd a comment