
తిరుపతి (అలిపిరి) : వయోవృద్ధులు (65 ఏళ్లు పైబడినవారికి), దివ్యాంగులకు ఈనెల 6, 20వ తేదీల్లో తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టోకెన్లను టీటీడీ అదనంగా జారీ చేయనుంది. ఆయా తేదీల్లో ఉదయం 10.00 గంటలకు మధ్యాహ్నం 2.00 గంటలకు రెండు వేల టోకెన్లు, 3.00 గంటలకు వెయ్యి టోకెన్లు జారీ చేయనున్నారు.
అలాగే ఈనెల 7, 21వ తేదీల్లో ఐదేళ్లలోపు చంటి పిల్లల తల్లిదండ్రులకు ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం మార్గం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ పీఆర్వో రవి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment