కోలీవుడ్ లవ్‌బర్డ్స్ నయనతార, విఘ్నేశ్ శివన్‌లు త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తమ ప్రేమ ప్రయాణానికి ముగింపు పలికి.. పెళ్లి బంధం కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.ఇప్పటికే పెళ్లి డేట్, ప్లేస్ కూడా ఫిక్స్ చేసుకున్నారట.
జూన్ 9న, పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో నయన్, విఘ్నేశ్‌ల వివాహం జరగబోతున్నుట్ల తెలుస్తుంది. ఇందులో భాగంగానే పెళ్లి వేదికను బుక్ చేసుకునేందుకే నయన్, విఘ్నేశ్‌లు శనివారం తిరుమల వచ్చినట్లు సమాచారం. అయితే తమ పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై నయన్ కానీ, విఘ్నేశ్ కానీ ఇప్పటివరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
'నేనూ రౌడీనే' సినిమా షూటింగ్ సమయంలో నయన్‌కు విఘ్నేశ్‌తో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరు కలిసి దిగిన పలు ఫొటోలను విఘ్నేశ్.. అప్పుడప్పుడు ఇన్‌స్టాలో పంచుకుంటూ ఉంటాడు. తాజాగా విఘ్నేశ్ దర్శకత్వం వహించిన 'కాతు వాకుల రెండు కాదల్' చిత్రంలో నయనతార నటించిన విషయం తెలిసిందే. విజయ్ సేతుపతి, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదలై.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment