తిరుమలలో బుధవారం పెళ్లిళ్ల సందడి నెలకొంది.
సాక్షి,తిరుమల: తిరుమలలో బుధవారం పెళ్లిళ్ల సందడి నెలకొంది. ఇక్కడి టీటీడీ కల్యాణ వేదిక, కాటేజీలు, ప్రైవేట్ మఠాల్లో 200 పెళ్లిళ్లు దాకా జరిగాయి. మన్మథనామ సంవత్సరం వైశాఖమాసం బుధవారం రోహిణీ నక్షత్రం మిథునలగ్నం ఉదయం 10.40 గంటలకు ఈ పెళ్లిళ్లు జరిగాయి. తిరిగి అర్ధరాత్రి తర్వాత గురువారం వేకువజాము మకరలగ్నంలో 01.02 గంటలు, తెల్లవారుజామున మీనలగ్నంలో 4 గంటలకు మరో 50 వివాహాలు జరగనున్నాయి.
ఈ పెళ్లిళ్లతో తిరుమలలో ఎక్కడ చూసినా కొత్త జంటల సందడి కనిపించింది. పెళ్లి తర్వాత శ్రీవారి దర్శనం కోసం కొత్త జంటలు క్యూలో వేచి ఉండడం కనిపించింది.