
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
తిరుమల: తిరుమల శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో సినీ నటుడు బ్రహ్మానందం, సినీ నటి మంచు లక్ష్మి దంపతులు, గాయకులు సునీత, శ్రీకృష్ణ ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి, లడ్డూప్రసాదాలు అందజేశారు. ‘ఒక్కమాట శరణనని..’ అన్న తాళ్లపాక అన్నమాచార్యులవారి సంకీర్తనను గాయని సునీత తన మధుర స్వరంతో ఆలపించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడుతూ కీర్తన ఆలపించారు.
ఎస్‌వీబీసీ చానల్‌లో ఇప్పటికే ‘అన్నమయ్య పాటకు పట్టాభిషేకం’ 80 ఎపిసోడ్‌లు చేశామని, వచ్చే నెలలో రెండోదశ ప్రారంభిస్తామని చెప్పారు. ట్రెండ్‌కు తగ్గట్టుగా యూట్యూబ్ ద్వారా వీడియోలతో కొత్త పాటల్ని అందిస్తామన్నారు. అన్ని రకాల ప్రేక్షకులను ఆకుట్టుకునేందుకు నాణ్యతతో కూడిన సరికొత్త పాటలతో ఆల్బమ్‌ను యూ ట్యూబ్ ద్వారా విడుదల చేసేందుకు కృషి చేస్తానని సునీత చెప్పారు.