తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీనివాసుడి సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం, కాలిబాట భక్తులకు 3గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీనివాసుడి సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం, కాలిబాట భక్తులకు 3గంటల సమయం పడుతోంది. వర్షాల కారణంగా అక్కడక్కడా తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడుతుండటంతో దెబ్బతిన్న ఘాట్ రోడ్డును నిపుణుల బృందం పరిశీలించనుంది.
దెబ్బతిన్న ఘాట్ రోడ్డుకు చేయాల్సిన మరమ్మతులు, ప్రత్యామ్నాయాలపై నివేదిక ఇవ్వనుంది. ఆకాశ గంగ, గోగర్భం డ్యామ్లు నిండటంతో నీటిని కిందికి విడుదల చేశారు. పాప వినాశనం కేపీ డ్యాం లో 90శాతం నీరు చేరింది.