సాక్షి, తిరుమల : తెలుగు భాషకు ప్రాచీన హాదా కల్పించడాన్ని తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకించిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కేంద్రం ప్రభుత్వంతో కొట్లాడి మరీ సాధించారని మాజీ ఎంపీ, ప్రముఖ రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఆదివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరంమీడియాతో మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్సార్ తెలుగు భాషకు ప్రాచీన హోదా తెస్తే.. చంద్రబాబు నాయుడు ఉన్న భాషను చంపేస్తున్నాడని ఆరోపించారు. అంగన్‌వాడీల్లో సైతం ఇంగ్లీష్ భాషను పెట్టి తెలుగు భాషకు మనుగడ లేకుండా చేస్తున్నారని విమర్శించారు. తెలుగు యూనివర్సిటీని సైతం ముయించేశారని మండిపడ్డారు. వైఎస్ జగన్‌తోనే రాజన్న రాజ్యం వస్తుందన్నారు. జగన్ ప్రభుత్వంలో తెలుగు భాష పరిమడిల్లాలని, గౌరవం పెరగాలని స్వామి వారిని కోరుకున్నానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment