
స్వామి వారిని దర్శించుకుని బయటకు వస్తున్న ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, కుటుంబ సభ్యులు
పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కాలినడకన తిరుమలకు వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆయన సతీమణి అపర్ణ, కుటుంబ సభ్యులు కలిసి తిరుమలకు మెట్ల మార్గం గుండా కాలినడకన వెళ్లినట్లు చెప్పారు. శనివారం ఉదయం స్వామి వారిని దర్శించుకొని తిరుగు ప్రయాణమైనట్లు తెలిపారు. వేంకటేశ్వరస్వామి వారి ఆశీస్సులు, ప్రజల దీవెనలతో అత్యధిక మెజార్టీ సాధించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. పుట్టపర్తి అభివృద్ధికి స్వామి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నట్లు తెలియజేశారు.