
సాక్షి, తిరుమల : : మూడు నెలల బాలుడు కిడ్నాప్ అయిన ఘటన తిరుమలలో కలకలం రేపింది. తమిళనాడులోని ఇల్లిపురం గ్రామానికి చెందిన కైసల్య, భర్త మధిరతో కలిసి తిరుమల కొండపై చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. శనివారం రాత్రి తిరుమల ఎస్‌వీ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర మగబిడ్డ (వీరా)ను పక్కన పడుకోబెట్టుకొని నిద్రిస్తున్నసమయంలో గుర్తుతెలియని దుండగులు అపహరించారు. వీర కనిపించకపోవడంతో మధిర, కౌసల్య ఆందోళన చెందారు. చుట్టుపక్కల గాలించినప్పటికీ ఆచూకీ దొరకలేదు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో బాలుడి మిస్సింగ్‌పై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవి ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment