Wedding: క్యాన్సర్‌తో నటి.. కంటికి రెప్పలా చూసుకునే ‍ప్రియుడు.. | Hina Khan Married to Rocky Jaiswal after being Together for 11 Years | Sakshi
Sakshi News home page

Hina Khan: 11 ఏళ్లుగా డేటింగ్‌.. పెళ్లి చేసుకున్న బుల్లితెర నటి

Jun 4 2025 6:58 PM | Updated on Jun 4 2025 7:07 PM

Hina Khan Married to Rocky Jaiswal after being Together for 11 Years

బుల్లితెర సెలబ్రిటీ జంట హీనా ఖాన్‌ (Hina Khan)- రాకీ జైస్వాల్‌ (Rocky Jaiswal) వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. 11 ఏళ్ల ప్రేమాయణానికి శుభం పలుకుతూ బుధవారం నాడు రిజిస్ట్రేషన్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను హీనా ఖాన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంది. ఇద్దరి ప్రపంచాలు వేరైనా ప్రేమ అనే బంధంతో ఒక్క గూటికి చేరాం. రెండు మనసులు ఒక్కటయ్యాయి. ఎవరూ విడదీయలేనంతగా మా బంధం బలపడింది. 

పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన నటి
దాన్ని పెళ్లితో మరింత ముందుకు తీసుకెళ్లాం. మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ వైవాహిక ఫోటోలను షేర్‌ చేసింది. ఇది చూసిన అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే హీనా ఖాన్‌, రాకీ జైస్వాల్‌ 2014 నుంచి డేటింగ్‌ చేస్తున్నారు. తన విజయాల్లోనే కాకుండా కష్టాల్లోనూ ఆమెకు రాకీ అండగా ఉన్నాడు. రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమెకు సపోర్ట్‌గా నిలబడ్డాడు. 

సీరియల్స్‌..
కీమోథెరపీ వల్ల ఆమె జుట్టు తీసేయాల్సి వస్తే అతడు సైతం గుండు గీయించుకుని తనకు మద్దతుగా ఉన్నాడు. తల్లిలా దగ్గరుండి సేవ చేశాడు. ఇలాంటి పార్ట్‌నర్‌ దొరకడం తన అదృష్టమని హీనా ఖాన్‌ పలుమార్లు సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది. హీనా ఖాన్‌.. యే రిష్తా క్యా కెహ్లాతా హై సీరియల్‌తో పాపులారిటీ సంపాదించుకుంది. కసౌటి జిందగీ కే, నాగిన్‌ (5వ సీజన్‌) సీరియల్స్‌లో ప్రధాన పాత్ర పోషించింది. హిందీ బిగ్‌బాస్‌ 11వ సీజన్‌లోనూ అలరించింది. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లలోనూ యాక్ట్‌ చేసింది.

 

 

చదవండి: తీవ్ర దుఃఖంలో శోభన.. మాటలు రావడం లేదంటూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement