రాహుల్కు ముద్దు పెట్టిన మహిళ హత్య | Assam woman who kissed Rahul Gandhi burnt to death by husband | Sakshi
Sakshi News home page

రాహుల్కు ముద్దు పెట్టిన మహిళ హత్య

Published Sat, Mar 1 2014 11:32 AM | Last Updated on Sat, Sep 2 2017 4:14 AM

రాహుల్కు ముద్దు పెట్టిన మహిళ హత్య

రాహుల్కు ముద్దు పెట్టిన మహిళ హత్య

గౌహతి :  ముద్దు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఉత్సాహం, ఉద్వేగం పట్టలేక ముద్దు పెడితే అది ఆమె ప్రాణాలకే ముప్పుగా పరిణమించింది. కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ముద్దు పెట్టిన పాపానికి ఓ మహిళ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఫిబ్రవరి 26న అసోంలోని జోరత్‌లో  స్వయం సహాయక గ్రూపులతో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో కరచాలనం చేయడానికి వచ్చిన పలువురు మహిళలు రాహుల్కు మరింత చేరువగా వచ్చి హఠాత్తుగా చెంపలపైనా, నుదిటిపైనా ముద్దులు పెట్టారు. దీంతో ఆయన ఒక్కసారిగా లేచి మహిళలకు అభివాదం చేశారు.

ఉత్సాహం పట్టలేక కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యురాలు బోంటి...రాహుల్ బుగ్గపై ముద్దు పెట్టింది. మరొకరు తలపై ముద్దిచ్చారు. ఆ సమయంలో ఇది పెద్దగా కలకలం సృష్టించనప్పటికీ ఆ ఘటన ఆ మహిళల ఇంట్లో చిచ్చు పెట్టింది. పేపర్లు, టీవీ ఛానల్స్లో ఈ వార్త పెద్ద ఎత్తున ప్రసారం చేయటంతో బోంటి భర్త తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దాంతో బోంటీని సజీవ దహనం చేసి ఆ తర్వాత తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. భర్త పెట్టిన నిప్పులో బాధితురాలు అగ్నికి ఆహుతి కాగా భర్త పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అతను ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement