Assam woman
-
Kanika Talukdar: జై కొట్టాల్సిందే!
అస్సాంకు చెందిన కనిక భర్త అనారోగ్యంతో చనిపోయాడు. కనికకు భవిష్యత్ చీకటిగా కనిపించింది. తాను ఎలా బతకాలి? అనే ఆందోళన మొదలైంది. ధైర్యం ఉంటే అదే దారి చూపిస్తుంది అంటారు. డీలా పడకుండా ధైర్యంగా ఉండడం నేర్చుకుంది. అయిదు వందల రూపాయల పెట్టుబడితో వర్మికంపోస్ట్ వ్యాపారానికి శ్రీకారం చుట్టిన కనిక ఇప్పుడు లక్షాధికారి అయింది... పెళ్లయిన మూడు సంవత్సరాలకు అస్సాంలోని బోర్జాహర్ గ్రామానికి చెందిన కనికా తలుక్దార్కు బిడ్డ పుట్టింది. బిడ్డ మూడు నెలల వయసులో ఉన్నప్పుడు భర్త అనారోగ్యంతో చనిపోవడం కనికను విషాదసాగరంలోకి నెట్టింది. కళ్ల ముందు పసిపాపే కనిపిస్తుంది. భవిష్యత్ మాత్రం మసకబారిపోయింది. ఆ సమయంలో వర్మికంపోస్ట్ రూపంలో ఒక వెలుగు కిరణం కనిపించింది. కొన్ని సంవత్సరాల క్రితం కృషి విజ్ఞాన కేంద్ర(కేవీకే) నిర్వహించిన ఒక వర్క్‌షాప్‌లో వర్మికంపోస్ట్, చేపల పెంపకం, కోళ్ల పెంపకం...మొదలైన వాటి గురించి తెలుసుకుంది కనిక. వర్క్‌షాప్ తాలూకు విషయాలు గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు వర్మికంపోస్ట్ తయారీ సులభం అనిపించింది. ఎందుకంటే ఆవు పేడలాంటి ముడిసరుకులు సేకరించడానికి తాను పెద్దగా కష్టపడనక్కర్లేదు. ఎక్కడికీ వెళ్లనవసరం లేకుండా తన చుట్టుపక్కల అందుబాటులో ఉన్న వనరులతోనే వర్మికంపోస్ట్ తయారుచేయవచ్చు. 2019లో నార్త్ ఈస్ట్ అగ్రికల్చర్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్స్ హబ్ రెండు నెలల ఓరియెంటేషన్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడం కనికకు ఎంతో ఉపకరించింది. శిక్షణలో భాగంగా వర్మివాష్ను తయారు చేయడం నేర్చుకుంది. ఇది వర్మికంపోస్ట్ నుంచి తయారుచేసే ద్రవసారం. సాధారణ వర్మికంపోస్ట్ కంటే ఎక్కువ నత్రజని, భాస్వరం..మొదలైనవి ఇందులో ఉంటాయి. అయిదు వందల రూపాయల పెట్టుబడితో వ్యాపారంలోకి అడుగు పెట్టింది కనిక. కృషి విజ్ఞాన కేంద్ర ఉచితంగా వానపాములను అందించింది. ‘జై వర్మికంపోస్ట్’ బ్రాండ్‌తో వర్మికంపోస్ట్, వర్మివాష్ అమ్మకానికి రెడీ అయింది. తయారీ సంగతి సరే, మరి కొనేవారు ఎవరు? రసాయన ఎరువులకు అలవాటు పడిన రైతులకు వర్మికంపోస్ట్ నచ్చుతుందా? అందుకే తన ఉత్పత్తికి తానే ప్రచారకర్తగా మారింది. వర్మికంపోస్ట్ వాడకం వల్ల నేలకు జరిగే మేలు ఏమిటో ఊరూరా తిరుగుతూ ప్రచారం చేసింది. ఆమె శ్రమ వృథా పోలేదు. వ్యాపారం అడుగుల స్థాయి నుంచి పరుగుల స్థాయికి చేరుకుంది. పేడ కోసం మొదట రెండు ఆవులను కొన్న కనిక ఆ తరువాత నాలుగు ఆవులను ఒకేసారి కొనగలిగే స్థాయికి చేరింది. ఒకప్పుడు ‘జై’ కంపెనీ ఒక సంవత్సరంలో 800 కిలోల వర్మికంపోస్ట్‌ను ఉత్పత్తి చేసేది. ప్రస్తుతం అది నెలకు 35 టన్నుల స్థాయికి చేరుకుంది. అస్సాం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో పాటు మేఘాలయా, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్‌లో ఎన్నో నర్సరీలు జై ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాయి. వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేకపోయినా అద్భుత విజయం సాధించిన కనిక ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. విద్యార్థుల కోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (అస్సాం) ప్రతి నెల కనికతో అవగాహన తరగతులు నిర్వహిస్తోంది. ‘ఇది కలలో కూడా ఊహించని విజయం. ఎలా బతకాలో అని భయపడిన నేను ఎంతోమందికి ఉపాధి కల్పించగలుగుతున్నాను. ఎలా బతకాలో తెలియక ఒకప్పుడు ధైర్యం కోల్పోయిన నేను ఇప్పుడు ఎంతోమందికి ధైర్యం చెబుతున్నాను. ఈ విశాలమైన ప్రపంచంలో మన కోసం ఎన్నో అవకాశాలు ఉంటాయి. వాటిలో ఒకటి అందిపుచ్చుకున్నా మన జీవితమే మారిపోతుంది’ అంటుంది నలభై అయిదు సంవత్సరాల కనికా తలుక్దార్. -
పెళ్లయిన మూడు రోజులకే భార్యపై ఘాతుకం
సాక్షి, గువహటి : పెళ్లయిన మూడు రోజులకే తాళికట్టిన భార్యపై భర్త ఘాతుకానికి పాల్పడ్డాడు. తాను కోరినంత కట్నం ఇవ్వలేదనే కారణంతో భార్యపై తన ఇద్దరు స్నేహితులతో కలిసి లైంగిక దాడికి తెగబడ్డాడు. దక్షిణ అస్సాంలోని కరీంగంజ్‌లో ఈనెల 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు భర్తను అరెస్ట్ చేసి మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధిత మహిళ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరడంతో ఈ దారుణం పోలీసుల దృష్టికి వచ్చింది. బంగారు ఆభరణాలను కట్నంగా ఇవ్వాలని తన భర్త కోరగా, తమ కుటుంబం ఇవ్వలేకపోవడంతో తన ఇద్దరు స్నేహితులతో కలిసి భర్త తనపై లైంగిక దాడి చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. కథువా, ఉన్నావ్ ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో అస్సాంలో మైనర్ బాలికలపై లైంగిక దాడులు, వేధింపులు పెరిగాయి. గత రెండు నెలలుగా అస్సాంలో ఈ తరహా కేసులు దాదాపు 20కి పైగా నమోదయ్యాయి. -
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మహిళ
దిబ్రుఘడ్ : తలుచుకుంటే మనిషి సాధించలేనిది ఏమీ లేదని మరోసారి రుజువైంది. భాష రాకపోయినా అస్సాంకు చెందిన ఓ మహిళ వస్త్రంపై భవద్గీతను నేసి వార్తల్లో నిలిచింది. గతేడాది డిసెంబర్లో దిబ్రుఘడ్కు చెందిన హేమప్రభ ఈ ప్రయత్నం మొదలుపెట్టారు. సంస్కతం భాషలో భవద్గీతలోని 500 శ్లోకాలు... ఆంగ్ల భాషలో ఓ అధ్యయనాన్ని ఆమె నేశారు. ఇందుకోసం ఆయా భాషల పండితుల సహకారం ఆమె తీసుకున్నారు. ఇంతకు ముందు ఆమె 80 అడుగుల పొడవు, 17 ఇంచుల వెడల్పు ఉన్న సిల్క్ క్లాత్ పై శంకర్‌దేవ్ గుణమాలను నేశారు. ఇందుకుగానూ ఆమెకు 9 నెలల సమయం పట్టిందంట. తన కళలతో ఓ మ్యూజియం ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో తాను ప్రభుత్వాన్ని కోరుతున్నానని ఆమె చెబుతున్నారు. -
రాహుల్‌కు ముద్దు పెట్టిన మహిళ హత్య
గౌహతి : ముద్దు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఉత్సాహం, ఉద్వేగం పట్టలేక ముద్దు పెడితే అది ఆమె ప్రాణాలకే ముప్పుగా పరిణమించింది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ముద్దు పెట్టిన పాపానికి ఓ మహిళ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఫిబ్రవరి 26న అసోంలోని జోరత్లో స్వయం సహాయక గ్రూపులతో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో కరచాలనం చేయడానికి వచ్చిన పలువురు మహిళలు రాహుల్‌కు మరింత చేరువగా వచ్చి హఠాత్తుగా చెంపలపైనా, నుదిటిపైనా ముద్దులు పెట్టారు. దీంతో ఆయన ఒక్కసారిగా లేచి మహిళలకు అభివాదం చేశారు. ఉత్సాహం పట్టలేక కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యురాలు బోంటి...రాహుల్ బుగ్గపై ముద్దు పెట్టింది. మరొకరు తలపై ముద్దిచ్చారు. ఆ సమయంలో ఇది పెద్దగా కలకలం సృష్టించనప్పటికీ ఆ ఘటన ఆ మహిళల ఇంట్లో చిచ్చు పెట్టింది. పేపర్లు, టీవీ ఛానల్స్‌లో ఈ వార్త పెద్ద ఎత్తున ప్రసారం చేయటంతో బోంటి భర్త తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దాంతో బోంటీని సజీవ దహనం చేసి ఆ తర్వాత తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. భర్త పెట్టిన నిప్పులో బాధితురాలు అగ్నికి ఆహుతి కాగా భర్త పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అతను ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.