
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ‘దఢక్’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఈ సినిమాలో జాన్వీ నటనతోపాటు మంచి అభినయం కనబరిచి ఆకట్టుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు జాన్వీ. సినిమాల సంగతి పక్కకు పెడితే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటారు జాన్వీ. వ్యక్తిగత విషయాలతో పాటు తన సినిమా అప్డేట్స్‌కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు జాన్వీ.
ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు జాన్వీ కపూర్. ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ పేరుతో అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యి.. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ క్రమంలో ఓ అభిమాని హద్దుమీరి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఏకంగా మనం ముద్దు పెట్టుకుందామా అని జాన్వీని అడిగాడు. అయితే అతడి తింగరి ప్రశ్నకు జాన్వీ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ముద్దడిగిన అభిమానికి సమాధానం చెప్తూ మాస్క్ ధరించిన ఫోటో పెట్టి నో అంటూ రిప్లై ఇచ్చారు జాన్వీ. ముద్దు కాదు ముందు మాస్క్ పెట్టుకో లేకపోతే పోతావ్ అన్నట్లుగా ఉంది ఈ ఫోటో. ఇదేకాక మరి కొంతమంది అడిగిన ఇలాంటి చిలిపి ప్రశ్నలకు తెలివిగా సమాధానం చెప్పారు జాన్వీ.
అలాగే తన అభిమాన కోస్టార్ ఎవరు అని అడిగిన ప్రశ్నకు, జాన్వీ తన ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ సినిమాలో సహనటుడు పంకజ్ త్రిపాఠిని కౌగిలించుకునే ఫోటోను షేర్ చేశారు. అలానే మరో యూజర్ ట్రావేలింగ్‌లో మీరు మర్చిపోలేని జ్ఞాపకం ఏంటని ప్రశ్నించగా.. కొన్ని సంవత్సరాల క్రితం తన తల్లిదండ్రులిద్దరూ సౌత్ ఫ్రాన్స్‌కు వెళ్లిన రోడ్ ట్రిప్‌కు సంబంధించిన పోటోని షేర్ చేశారు జాన్వీ కపూర్. ప్రస్తుతం జాన్వీ నటిస్తున్న ‘గుడ్ లక్ జెర్రీ’ షూటింగ్‌ను ఇటీవల ముగిసింది. ఈ చిత్రాన్ని ఆనంద్ ఎల్. రాయ్ నిర్మించారు. సిద్దార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహించారు. ఇందులో దీపక్ డోబ్రియాల్, మీతా వశిష్త్, నీరజ్ సూద్ కీలకపాత్రలో నటించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
చదవండి:
చాలా బాధగా ఉంది : జాన్వీ కపూర్
Comments
Please login to add a commentAdd a comment