
ఈ పిట్ట మరీ వెర్రిబాగులు టైపులాగుంది.. ముద్దెట్టుకోవాలంటే.. ఇంకో పిట్టను పెట్టుకోవాలి గానీ.. ఇలా మృత్యువుతో ముద్దులాటేమిటి.. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇదో సన్‌బర్డ్. ఇవి పువ్వుల నుంచి మకరందాన్ని తాగుతుంటాయి.. పచ్చగా కనిపిస్తే.. పువ్వు అనుకుందేమో ఏమోగానీ.. ఇలా పాముకు దగ్గరగా వెళ్లింది. అయితే, ఈ పిట్ట సర్పానికి అతి సమీపానికి వెళ్లినా.. ముద్దాడలేదట. తాను తీసిన ఫొటో యాంగిల్ వల్ల ఆ ఎఫెక్ట్ వచ్చిందని ఇండోనేసియాకు చెందిన బుడీ గునావాన్ చెప్పారు. ఈ చిత్రాన్ని క్లిక్‌మనిపించింది ఈయనే.
Comments
Please login to add a commentAdd a comment