
సింహానికి ముద్దు పెడితే..
సింహాలను చూసి క్రూర జంతువులని భయపడటం సహజం. అవి జూలో బంధించి ఉన్నా కూడా వాటి దగ్గరికి పోవడానికి పిల్లలు, పెద్దలు ఎవరైనా తటపటాయించాల్సిందే. కానీ జూలో ఉన్న సింహాన్ని చూసి ఒక చిన్నారి చాలా ముచ్చటపడింది. అంతకన్నా మురిపెంగా గాల్లోకి ముద్దులు విసిరింది. దీంతో సింహం వైపునుంచి వచ్చిన రియాక్షన్ చూసి ఆశ్చర్య పోవడం అక్కడున్న వారి వంతైంది. అచ్చం అలవాటైన పెంపుడు జంతువులాగా ప్రేమను చూపించడం ఆసక్తికరంగా మారింది. అయితే ఆ ఆ వీడియో ఎక్కడదనేది మాత్రం తెలియరాలేదు.