ముంబై: అభిమానులు తమ అభిమాన క్రికెటర్ కనిపిస్తే ఆటోగ్రాఫ్.. వీలుంటే సెల్ఫీలు తీసుకోవడం కామన్. కానీ తమ అభిమాన క్రికెటర్‌ను కలిసిన ఆనందంలో ముద్దులు పెడుతూ ట్రెండ్ మార్చుతున్నారు. అయితే మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో సెక్యూరిటీ కళ్లు కప్పి మైదానంలోకి దూసుకరావడం ఇబ్బంది కలిగించే అంశం. ఇక మ్యాచ్ మధ్యలో తరుచుగా అభిమానులు మైదానంలోకి వస్తుండటంపై సెక్యూరిటీ వైఫల్యాలపై అందరూ వేలేత్తి చూపిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో టీమిండియా-వెస్టిండీస్‌ల మధ్య జరిగిన రెండో టెస్టు తొలి రోజు ఆటలో ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చి కెప్టెన్ విరాట్ కోహ్లితో సెల్ఫీ దిగి, ముద్దు పెట్టే ప్రయత్నం చేశాడు. అంపైర్లు, సెక్యూరిటీ అప్రమత్తవడంతో అభిమానిని బయటకి పంపించారు. అభిమానుల నుంచి ఊహించని ఇలాంటి ఘటనే టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు ఎదురైంది. (ముద్దు మీరిన అభిమానం)
ఆదివారం విజయ్‌హజారే ట్రోఫి తొలి క్వార్టర్ ఫైనల్‌లో భాగంగా ముంబై-బిహార్‌ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. బిహార్ నిర్దేశించిన 70 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ముంబై బ్యాటింగ్‌కు దిగింది. అయితే రోహిత్ బ్యాటింగ్ చేస్తున్నసమయంలో ఓ అభిమాని అకస్మాత్తుగా మైదానంలోకి పరుగెత్తుకొచ్చాడు. రోహిత్‌కు ముద్దు పెట్టే ప్రయత్నం చేసి, పాదాలను తాకబోయాడు. అనంతరం అభిమాని ఎగిరిగంతేసుకుంటూ మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం రోహిత్‌కు అభిమాని ముద్దుపెడుతున్న వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. రోహిత్‌ను అభిమాని ముద్దుపెట్టుకుంటే రితికా అసూయ పడుతున్నారు కావచ్చని అభిమానులు ఫన్నీగా స్పందించారు. ఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఘన విజయం సాధించింది. (మూడు సెక్షన్‌ల కింద కేసు నమోదు...)
Comments
Please login to add a commentAdd a comment