పాపోన్‌ ముద్దు వివాదం : స్పందించిన మైనర్‌  | Papon kiss controversy: Minor girl breaks her silence | Sakshi
Sakshi News home page

పాపోన్‌ ముద్దు వివాదం : స్పందించిన మైనర్‌ 

Feb 24 2018 3:33 PM | Updated on Apr 3 2019 7:03 PM

Papon kiss controversy: Minor girl breaks her silence - Sakshi

మైనర్‌కు ముద్దు పెడుతున్న సింగర్‌ పాపోన్‌

ముంబై : ఓ మైనర్‌ బాలికను ముద్దు పెట్టుకున్న సింగర్‌ కమ్‌ కంపోజర్‌ పాపోన్ ఒక్కసారిగా చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. మైనర్‌ బాలికను ముద్దు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ఈ విషయంపై బాలిక తండ్రి, సింగర్‌ పాపోన్‌నే వెనకేసుకొచ్చారు. అతడిని తప్పుగా అర్థం చేసుకోవద్దని, నా కూతురికి ఆయన తండ్రి స్థానంలో ఉండేవారని చెప్పారు. ఈ వివాదాస్పద ఘటనపై మౌనం వహించిన మైనర్‌ బాలిక, ఎట్టకేలకు స్పందించింది.   మైనర్‌ బాలిక, ఇతర పోటీదారులు, వారి తల్లిదండ్రులు ఈ ఘటనపై స్పందించారు. పాపోన్‌ తప్పుడు ఉద్దేశ్యంతో ఏం చేయలేదని, తన సొంత బిడ్డను ముద్దు పెట్టుకున్నట్టు తనని ముద్దు పెట్టుకున్నాడని మైనర్‌ బాలిక చెప్పింది. తన అమ్మ, నాన్న కూడా ఎంతో ప్రేమతో ముద్దు చేశారని పేర్కొంది. దీనిలో ఎలాంటి తప్పు లేదని చెప్పింది.  

పాపోన్‌ తన కూతురికి తండ్రి లాంటి వారని, ఆ వీడియోలో ఎలాంటి తప్పు లేదని బాలిక తండ్రి కూడా పాపోన్‌పై వస్తున్న ఆరోపణలను ఖండించారు. తన కూతురి డ్రీమ్స్‌ను పాపోన్‌ ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండేవారని పేర్కొన్నారు. అయితే సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న ఈ వీడియోపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు న్యాయవాది రునా భుయాన్‌.. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘంలో ఫిర్యాదు చేశాడు. పోక్సో యాక్ట్‌ కింద పాపోన్‌పై లైంగిక దాడి కేసు నమోదు చేయాలని భుయాన్‌ కోరారు. ఇలాంటి ఘటనలు చూశాక రియాల్టీ షోలలో పాల్గొనే పిల్లల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సింగర్‌ పాపోన్‌కు, ఆ టీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌కు నోటీసు జారీచేసింది. ముంబై పోలీసులు ఈ విషయంపై విచారణ సాగిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా పాపోన్ సమస్యను పరిగణనలోకి తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement