Singer Papon
-
'ముద్దు' వివాదం : జడ్జిగా తప్పుకుంటున్నా
ముంబై : మైనర్ బాలికను ముద్దు పెట్టుకున్న వివాదంలో కూరుకుపోయిన బాలీవుడ్ సింగర్ కమ్ కంపోజర్ పాపోన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వివాదం సద్దుమణిగే వరకు వాయిస్ ఇండియా ప్రొగ్రామ్ న్యాయ నిర్ణేతగా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మ్యూజిక్ రియాల్టీ షోలో న్యాయ నిర్ణేతగా ఉన్న పాపోన్, హోలీ ప్రత్యేక ఎపిసోడ్ చిత్రీకరణ సందర్భంగా ఓ మైనర్ బాలికకు రంగు పూసి పెదాలపై ముద్దు పెట్టారు. ఆ వ్యవహారమంతా ఫేస్ బుక్ లైవ్‌లో టెలీకాస్ట్ అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తనపై తప్పుడిగా వస్తున్న ఆరోపణలు పూర్తిగా సద్దుమణిగే వరకు న్యాయ నిర్ణేతగా తాను వ్యవహరించనని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, చివరికి నిజమే గెలుస్తుందన్నారు. ఈ షోకి షాన్, హిమేష్ రేష్మియాలు కూడా జడ్జిలుగా ఉన్నారు. ఈ వివాదంపై మైనర్ బాలిక, ఆమె తండ్రి స్పందించారు. పాపోన్ తప్పుడు ఉద్దేశ్యంతో ఏమీ చేయలేదని, పాపోన్ తన కూతురికి తండ్రి లాంటి వారని మైనర్ బాలిక తండ్రి చెప్పాడు. ఇదే విషయాన్ని ఆ బాలిక కూడా చెప్పింది. సొంత కూతురిలాగానే తనని ముద్దుపెట్టుకున్నాడని తెలిపింది. తన అమ్మ, నాన్న కూడా ఎంతో ప్రేమతో ముద్దు చేశారని పేర్కొంది. దీనిలో ఎలాంటి తప్పు లేదని చెప్పింది. అయితే పాపోన్‌పై వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో అస్సాం బాలల హక్కుల సంఘం ఈయనపై కేసు నమోదుచేసింది. -
పాపోన్ ముద్దు వివాదం : స్పందించిన మైనర్
ముంబై : ఓ మైనర్ బాలికను ముద్దు పెట్టుకున్న సింగర్ కమ్ కంపోజర్ పాపోన్ ఒక్కసారిగా చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. మైనర్ బాలికను ముద్దు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ విషయంపై బాలిక తండ్రి, సింగర్ పాపోన్నే వెనకేసుకొచ్చారు. అతడిని తప్పుగా అర్థం చేసుకోవద్దని, నా కూతురికి ఆయన తండ్రి స్థానంలో ఉండేవారని చెప్పారు. ఈ వివాదాస్పద ఘటనపై మౌనం వహించిన మైనర్ బాలిక, ఎట్టకేలకు స్పందించింది. మైనర్ బాలిక, ఇతర పోటీదారులు, వారి తల్లిదండ్రులు ఈ ఘటనపై స్పందించారు. పాపోన్ తప్పుడు ఉద్దేశ్యంతో ఏం చేయలేదని, తన సొంత బిడ్డను ముద్దు పెట్టుకున్నట్టు తనని ముద్దు పెట్టుకున్నాడని మైనర్ బాలిక చెప్పింది. తన అమ్మ, నాన్న కూడా ఎంతో ప్రేమతో ముద్దు చేశారని పేర్కొంది. దీనిలో ఎలాంటి తప్పు లేదని చెప్పింది. పాపోన్ తన కూతురికి తండ్రి లాంటి వారని, ఆ వీడియోలో ఎలాంటి తప్పు లేదని బాలిక తండ్రి కూడా పాపోన్‌పై వస్తున్న ఆరోపణలను ఖండించారు. తన కూతురి డ్రీమ్స్‌ను పాపోన్ ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండేవారని పేర్కొన్నారు. అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ వీడియోపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు న్యాయవాది రునా భుయాన్.. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘంలో ఫిర్యాదు చేశాడు. పోక్సో యాక్ట్ కింద పాపోన్‌పై లైంగిక దాడి కేసు నమోదు చేయాలని భుయాన్ కోరారు. ఇలాంటి ఘటనలు చూశాక రియాల్టీ షోలలో పాల్గొనే పిల్లల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సింగర్ పాపోన్కు, ఆ టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానెల్‌కు నోటీసు జారీచేసింది. ముంబై పోలీసులు ఈ విషయంపై విచారణ సాగిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా పాపోన్ సమస్యను పరిగణనలోకి తీసుకుంది. -
వివాదాస్పద 'ముద్దు'పై స్పందించిన సింగర్
సాక్షి, ముంబై: 'బాలికకు అసభ్య ముద్దు' అంటూ గత కొన్నిరోజులుగా కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ సింగర్ కమ్ కంపోజర్ పాపన్ అంటున్నాడు. లేనిపోని రాద్ధాంతం చేయడం వల్ల బాలిక కుటుంబంతో పాటు తన ఫ్యామిలీ చిక్కుల్లో పడుతుందని, తాను ఎలాంటి తప్పుచేయలేదని భావిస్తున్నట్లు తెలిపాడు. ఈ వివాదానికి సంబంధించి ఓ లేఖ విడుదల చేశాడు పాపన్. పాపన్గా పేరుపొందిన అన్గరాగ్ మహంతా ఓ ఛానెల్ లో ప్రసారమవుతున్న వాయిస్ ఇండియా కిడ్స్ ప్రోగ్రాంకి న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. మెంటర్‌గా ఉన్న పాపన్.. హోలీ ఎపిసోడ్ అనంతరం ఓ బాలిక(11) ముఖానికి రంగురుద్ది పెదాలపై ముద్దాడాడు. దీంతో సింగర్‌ను వివాదాలు చుట్టుముట్టాయి. బాలీవుడ్ సింగర్ లేఖలో ఏమన్నాడంటే.. 'నాకు పెళ్లయి 14 ఏళ్లయింది. సంతానంగా ఇద్దరు చిన్న పిల్లలున్నారు. ఏదైనా విషయాన్ని వెంటనే వ్యక్తం చేయడం నాకు అలవాటు. అందులో భాగంగానే ఓ 11 ఏళ్ల చిన్నారికి ముద్దు పెట్టాను. దురుద్దేశంతో చేసిన చర్య ఎంత మాత్రం కాదు. అలా అనుకుంటే నా ఫేస్బుక్ లైవ్ వీడియోగా ఎందుకు అందరికీ తెలిసేలా ప్రచారం చేస్తానో మీరే ఆలోచించండి. ఏ తప్పుచేయలేదని భావిస్తున్నాను. ముద్దు పెట్టుకున్నందుకు క్షమాపణ అడుగుతున్నాను. ఒకవేళ నేను చేసిన దాంట్లో తప్పుందనుకుంటే ఇదివరకే నా ఫేస్బుక్లో ఆ వీడియోను డిలీట్ చేసేవాణ్ని. మీరు చేసే విమర్శలు, వ్యాఖ్యలు రెండు కుటుంబాల్లో చిచ్చు పెడుతాయి. ఓ అమాయక చిన్నారి జీవితాన్ని నాశనం చేయాలని చూడొద్దంటూ' పలు విషయాలను పాపన్ రాసుకొచ్చాడు. మరోవైపు మైనర్ బాలిక తండ్రి సైతం సింగర్ పాపన్ను వెనకేసుకొచ్చారు. 'పాపన్ కావాలని ఆ పని చేయలేదు. అతడిని తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరమే లేదని' బాలిక తండ్రి ఇదివరకే స్పందించారు. తన గురించి తెలిసిన వాళ్లు పాపోన్ తప్పుచేశాడని భావించడం లేదని,ఈ వివాదంలో తన కుటుంబం ఎంతో అండగా నిలిచిందని పాపన్ తెలిపాడు. కాగా, సుప్రీం కోర్టు న్యాయవాది రునా భుయాన్.. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘంలో సింగర్ పాపన్పై ఫిర్యాదు చేశారు. పోక్సో(POCSO) యాక్ట్ కింద పాపోన్‌పై లైంగిక దాడి కేసు నమోదు చేయాలని భుయాన్ కోరుతున్నారు. వివాదం ముదురుతున్న కొద్దీ దీనిపై సింగర్ పాపన్ లేఖ ద్వారా వివరణ ఇచ్చుకున్నాడు.