Bride And Groom Kiss Like Crazy On The Mandap, Video Viral On Social Media - Sakshi
Sakshi News home page

Viral video: పెళ్లిలో ముద్దాడిన వరుడు, వధువు.. చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి

Published Fri, Dec 17 2021 5:43 PM | Last Updated on Sat, Dec 18 2021 11:25 AM

Viral Video: Bride and Groom Kiss Like Crazy On The Mandap - Sakshi

ఒకప్పటి కాలంలో పెళ్లి అయ్యే వరకు వధువు, వరుడికి అస్సలు పరిచయం ఉండేది కాదు. పెళ్లి మండపంలోనే ఒకరినొకరు చూసుకునే పద్దతులు ఉండేవి. కానీ కాలం మారింది. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లతోపాటు లవ్‌ మ్యారేజ్‌లు, పెళ్లికి ముందే డేటింగ్‌లు, లివింగ్‌ ఇన్‌ రిలేషన్‌లు పుట్టుకొచ్చాయి. ఎన్ని మారినా పెళ్లి జరిపించే పద్దతులు మాత్రం మారలేదు. ఎవరి సాంప్రదాయలు, పద్దతులకు అనుగుణంగా పెళ్లిలు జరిపిస్తున్నారు. 

తాజాగా హిందూ ఆచారం ప్రకారం జరుగుతున్న ఓ పెళ్లిలో వరుడు వధువుని ముద్దు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. వీడియోలో పెళ్లితంతును ముగించిన తురువాత వధువుని ముద్దు పెట్టుకోవాలని మండపం వద్ద ఉన్న అతిథులు వరుడిని కోరారు. దీంతో పెళ్లి వేదిక వద్ద కుటుంబ సభ్యలు, బంధువులు ఉన్నప్పటికీ సిగ్గుపడకుండా వరుడు, పెళ్లి కూతురు ముఖాన్ని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టాడు. వధువు కూడా వరుడు వద్దకు జరిగి అతని భుజంపై చేతులు వేసి కిస్‌ చేసింది.
చదవండి: Viral Video: మోడల్స్‌ను జంతువులుగా చూపించారు.. తీవ్ర విమర్శలు రావడంతో..

తమ చుట్టూ మనుషులు, కెమెరాలు ఉన్న విషయం మర్చిపోయి ఒకరినొకరు ముద్దు పెట్టు​కున్నారు. అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఇప్పుడు అన్నీ పెళ్లిళ్లో ఇలాంటివి కామన్‌ అయపోయాయని మద్దతిస్తుంటే.. మరికొందరు ఏంటి ఈ దారుణం.. పెళ్లి అయ్యే వరకు కూడా ఆగాలేరా.. పద్దతులను మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు..అంటూ ఫైర్‌ అవుతున్నారు. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
చదవండి: ఓరి నీ యేషాలో.. యాపిల్‌ పకోడీ అట! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement