
ప్రముఖ కంపెనీ సీఈవో ఇలా చేశాడేంటి..!
ఓ ప్రముఖ కంపెనీ మాజీ సీఈవో చేసిన పని ఇప్పుటు హాట్ టాపిక్ గా మారింది. ఫియట్ కంపెనీ మాజీ సీఈవో లాపో ఎల్కన్ తన పక్కనే నిల్చున్న హీరోయిన్ ఉమా థర్మన్ ను దగ్గరకు లాక్కుని గాఢంగా ముద్దుపెట్టుకున్నారు. చారిటీ కార్యక్రమంలో ఇలాంటి దిగజారుడు పనులు వ్యాపార దిగ్గజం చేయడంపై అందరూ ఆశ్చర్యపోయారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. అమెరికన్ ఫౌండేషన్ ఫర్ ఎయిడ్స్ రీసెర్చ్ వారు, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించిన ఉమా థర్మన్ సంయుక్తంగా ఈవెంట్ నిర్వహించారు. ఎయిడ్స్ బాధితులకు సహాయార్థం విరాళాలు సేకరించేందుకు ఏర్పాటుచేసిన ఈవెంట్ లో ఫ్యాషన్ షో టిక్కెట్లు కూడా విజేతలకు అందజేశారు.
విక్టోరియా ఫ్యాషన్ షోకు సంబంధించి ఆయన 1.32 కోట్ల రూపాయలు (1.96 లక్షల అమెరికా డాలర్లు) గెలుపొందారు. దీంతో తన సంతోషాన్ని వ్యక్తం చేయడానికి ఓ వింత మార్గాన్ని ఎంచుకున్నారు. ఈవెంట్ నిర్వహిస్తోన్న నటి థర్మన్ ను దగ్గరికి ఆమెతో లాక్కుని బలవంతంగా లిప్ లాప్ చేశారు. ఊహించని ఘటనతో ఆమె షాక్ కు గురైనా వెంటనే కోలుకుంది. ముద్దుపై స్పందించలేదు కానీ, తీవ్ర అసహనానికి గురైనట్లు మాత్రం తెలుస్తోంది. స్మోక్ చేస్తున్న ఎల్కన్ అవకాశవాది అని అందుకే అవకాశాన్ని వాడుకున్నాడని లెస్సీ స్లోనే అనే ఆర్గనైజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్మన్ కూడా ముద్దు విషయంపై హ్యాపీగా లేదని చెప్పింది. ఆమె అనుమతి లేనిదే ఇలాంటి దిగజారుడు చర్యకు ఇటలీ వ్యాపారవేత్త సాహసించాడంటూ మండిపడింది.