నాలుగు రోజుల పర్యటన ముగింపులో భాగంగా జపాన్‌లో నివసిస్తున్న ఫిలిప్పీన్స్ వాసులతో టోక్యోలో సమావేశమయ్యారు రోడ్రిగో. ఈ క్రమంలో కార్యక్రమం ముగిసిన తర్వాత తాను ముద్దుపెట్టుకొనేందుకు వీలుగా ఐదుగురు మహిళా వలంటీర్లను వేదికకు దగ్గరగా కూర్చోవాలని కోరాడు రోడ్రిగో. వీరిలో మొదటి మహిళ రోడ్రిగోను ముద్దు పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడింది. తన పెదవులపై, మెడపై ముద్దు పెట్టుకోవద్దని ఆమె కోరింది. దాంతో రోడ్రిగో ఆ మహిళ చెంపలపై ముద్దుపెట్టుకొని పంపించారు. అనంతరం రెండో మహిళది అదే పరిస్థితి. అయినా రోడ్రిగో తీరు మారలేదు.