
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అయితే, వివాహ వేడుకలలో ఏదో ఒక ట్విస్ట్ జరిగి ఆ పెళ్లి కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఓ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో పెళ్లి మండపంలో వరుడుకు ఎదరుగా వధువు కూర్చుని ఉంది. చుట్టూ కుటుంబ సభ్యలు, బంధువులు, స్నేహితులు నిల్చొని ఉన్నారు. ఇంతలో.. అకస్మాత్తుగా వరుడు వధువును ముద్దు పెట్టుకుంటాడు.
అయితే ఈ సంఘటన చూసిన వారంతా నవ్వుకుంటారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది..అక్కడ వివాహ సాంప్రదాయల్లో భాగంగా వధువు నోటిలో పాన్ ఉంచుతారు. వరుడు దాన్ని చేతితో తాకకుండా పాన్‌ను వధువు నోటిలో నుంచి తీయాలి. కాబట్టి వరుడు వధువు నోటి నుంచి పాన్ లాగడానికి ప్రయత్నించినప్పుడు, అతను ఆమెను ముద్దు పెట్టుకుంటాడు.ఈ సన్నివేశాన్ని అక్కడ ఉన్న వారు చాలా మంది తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో హల్‌చల్ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment