wedding celebration
-
పెళ్లికి సిద్ధమవుతున్న విజయ్‌మాల్యా కుమారుడు (ఫొటోలు)
-
పెళ్లింట విషాదం..
-
వివాహ బంధంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ కార్తిక.. పెళ్లి ఫోటోలు వైరల్
సీనియర్ నటి రాధ కుమార్తె, హీరోయిన్ కార్తిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం(నవంబర్ 19) ఉదయం రోహిత్ మేనన్‌తో కార్తిక మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. తిరువనంతపురంలోని కవడియార్ ఉదయపాలస్ కన్వెన్షన్ సెంటర్లో..కేరళ సంప్రదాయంలో వీరిద్దరి వివాహం జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతులు, రాధిక, సుహాసిని తదితరులు హాజరై, నూతన వధూవరులను ఆశ్వీరదించారు. ప్రస్తుతం కార్తిక పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, జోష్(2009) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కార్తిక. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా.. కార్తిక నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత జీవా నటించిన ‘రంగం’ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించింది. బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, దమ్ము చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. 2015 నుంచి కార్తిక చిత్రపరిశ్రమకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం వ్యాపార రంగంలో బిజీ అయిపోయింది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Neelakkuyil Entertainments (@neelakkuyil_entertainments) View this post on Instagram A post shared by Neelakkuyil Entertainments (@neelakkuyil_entertainments) View this post on Instagram A post shared by Radikaa Sarathkumar (@radikaasarathkumar) View this post on Instagram A post shared by Suhasini Hasan (@suhasinihasan) -
బాయ్‌ఫ్రెండ్‌తో వెడ్డింగ్‌కు హాజరైన స్టార్ హీరోయిన్!
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. శాండల్‌వుడ్‌లో కెరీర్ ప్రారంభించిన ముద్దుగుమ్మ తెలుగులో కెరటం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అగ్రహీరోల సరసన నటించింది. లౌక్యం, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, నాన్నకు ప్రేమతో, సరైనోడు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో కనిపించింది. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్లో బిజీగా మారిపోయింది. గతేడాది ఛత్రివాలి సినిమాతో ప్రేక్షకుల అలరించిన భామ.. తాజాగా 'బూ' అనే హార్రర్ చిత్రంతో ముందుకొచ్చింది. (ఇది చదవండి: పెళ్లి వేడుకల్లో మనోజ్- మౌనిక.. ఆమెను ఇలా ఎప్పుడైనా చూశారా? ) అయితే తాజాగా ముంబయిలో జరిగిన ప్రముఖ నిర్మాత మధు మంతెన పెళ్లిలో తళుక్కున మెరిసింది. తన ప్రియుడు, నిర్మాత జాకీ భగ్నానితో కలిసి వెడ్డింగ్ వేడుకల్లో సందడి చేసింది. కాగా.. 2021లో రకుల్ ప్రీత్ సింగ్ బర్త్‌డే సందర్భంగా జాకీ భగ్నానీ ఇన్‌స్టాగ్రామ్‌లో విష్ చేయడంతో డేటింగ్ రూమర్స్ వైరలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలు సందర్భాల్లో వీరిద్దరు జంటగా కనిపించారు. తాజాగా మరోసారి బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి నిర్మాత మధుమంతెన- ఐరా త్రివేది పెళ్లిలో సందడి చేసింది. దీంతో ఈ ప్రేమజంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: నాతో అసభ్యంగా ప్రవర్తించాడు.. జీర్ణించుకోలేకపోయా: ప్రగతి షాకింగ్ కామెంట్స్) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
పెళ్లి వేడుకల్లో మనోజ్- మౌనిక.. ఆమెను ఇలా ఎప్పుడైనా చూశారా?
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఇటీవలే ఓ ఇంటివాడైనా సంగతి తెలిసిందే. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను ప్రేమ వివాహాం చేసుకున్నారు. అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య మంచు లక్ష్మిప్రసన్న ఇంట్లో వేడుక జరిగింది. అయితే తాజాగా ఈ జంట సీనియర్ నటి సుమలత కుమారుడి పెళ్లిలో సందడి చేశారు. తాజాగా ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు మంచు లక్ష్మి తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ( ఇది చదవండి: పెళ్లి పార్టీలో డ్యాన్స్‌తో దుమ్ములేపిన సుమలత, యశ్) అయితే ఈ పెళ్లికి సతీసమేతంగా హాజరైన మంచు మనోజ్ - భూమా మౌనిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా భూమా మౌనిక సినీతారల మధ్య చాలా ఫ్యాషన్‌గా కనిపించారు. ఎప్పుడు సంప్రదాయ దుస్తుల్లోనే కనిపించిన మౌనికను అలా సినీ తారల మధ్య చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. ఫిల్మ్ ఇండస్ట్రీ సీనియర్ నటి, కర్ణాటక ఎంపీ సుమలత కుమారుడు అభిషేక్ వివాహం బెంగళూరులో ఘనంగా జరిగింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రసాద్ బిడపా కుమార్తె అవివాను అభిషేక్ వివాహం చేసుకున్నాడు. గ్రాండ్‌గా జరిగిన మ్యారేజ్ పార్టీలో కొత్త జంటతో కలిసి స్టార్ హీరోలు సందడి చేశారు. ( ఇది చదవండి: నాతో అసభ్యంగా ప్రవర్తించాడు.. జీర్ణించుకోలేకపోయా: ప్రగతి షాకింగ్ కామెంట్స్) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో పెళ్లిసందడి..
-
'ప్రైవసీకి భంగం'.. ఫోటోలు లీకవడంపై ఆగ్రహం
పాకిస్తాన్ యంగ్ క్రికెటర్ షాహిన్ అఫ్రిది మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కూతురు అన్షా అఫ్రిదిని వివాహమాడిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 3న కుటుంబసభ్యుల సమక్షంలో వీరి నిఖా జరిగింది. ఇస్లాం మతం ప్రకారం పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు రిలీజ్ చేయలేదు. కానీ పెళ్లికి హాజరయిన వాళ్లలో కొంతమంది పెళ్లి ఫోటోలు తీసి సోషల్ మీడియలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. ఫోటోలు లీక్ కావడంపై తాజాగా షాహిన్ అఫ్రిది ఆగ్రహం వ్యక్తం చేశాడు. ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ''ముందుగా విషెస్ తెలిపినందుకు మీకందరికి ధన్యవాదాలు. అయితే ఒక విషయం తీవ్రంగా నిరాశపరిచింది. అనుమతి లేకుండా మా పెళ్లికి సంబంధించిన ఫోటోలు లీక్ చేయడం బాధించింది. ఆ ఫోటోలు మా ప్రైవసీకి భంగం కలిగించేలా ఉన్నాయి. మీకందరికి ఒక విజ్ఞప్తి. మళ్లీ ఇలాంటివి రీపీట్ కాకూడదని కోరుకుంటున్నా. మాకు సహకరిస్తారని ఆశిస్తున్నా. మాకు మంచి మొమోరబుల్ అయిన పెళ్లి వేడుకను దయచేసి స్పాయిల్ చేయొద్దు'' అని చెప్పుకొచ్చాడు. కాగా షాహిన్ అఫ్రిది వివాహ వేడుకకు పలువురు పాక్ క్రికెటర్లు హాజరయ్యారు. బాబర్ ఆజం, షాదాబ్‌ఖాన్, ఫఖర్ జమాన్, సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు హాజరయ్యారు. ఇక మోకాలి గాయం సర్జరీ తర్వాత టి20 ప్రపంచకప్‌లో ఆడినప్పటికి అఫ్రిది అంతగా ప్రభావం చూపించలేకపోయాడు. కాగా వివాహానికి కొద్ది రోజుల ముందు వరకు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడిన అఫ్రిది ఫిబ్రవరి 13 నుంచి జరగనున్న పీఎస్ఎల్ ఎనిమిదో ఎడిషన్‌లో లాహోర్ ఖలండర్స్ తరపున ఆడనున్నాడు. It's very disappointing that despite many and repeated requests, our privacy was hurt and people kept on sharing it further without any guilt. I would like to humbly request everyone again to kindly coordinate with us and not try to spoil our memorable big day. — Shaheen Shah Afridi (@iShaheenAfridi) February 4, 2023 చదవండి: షాహీన్‌తో కుమార్తె వివాహం.. ఆఫ్రిది భావోద్వేగం! ట్వీట్ వైరల్ -
వివాహ వేడుకలకు హాజరుకానున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. నెల్లినర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 4 గంటలకు విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం దాకమర్రికి చేరుకుంటారు. ఓ కాలేజీ ఆవరణలో జరుగుతోన్న అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకలో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 6.30 గంటలకు విశాఖ నుంచి గుంటూరు జిల్లా మంగళగిరి వెళ్లనున్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుమార్తె వివాహ వేడుకకు హాజరు కానున్నారు సీఎం వైఎస్ జగన్. ఇదీ చదవండి: AP: ఇకపై పింఛన్ రూ.2,750 -
పెళ్లిలో వరుడి చిలిపి పని.. ఒక్కసారిగా అందరు షాక్..!
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అయితే, వివాహ వేడుకలలో ఏదో ఒక ట్విస్ట్ జరిగి ఆ పెళ్లి కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఓ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో పెళ్లి మండపంలో వరుడుకు ఎదరుగా వధువు కూర్చుని ఉంది. చుట్టూ కుటుంబ సభ్యలు, బంధువులు, స్నేహితులు నిల్చొని ఉన్నారు. ఇంతలో.. అకస్మాత్తుగా వరుడు వధువును ముద్దు పెట్టుకుంటాడు. అయితే ఈ సంఘటన చూసిన వారంతా నవ్వుకుంటారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది..అక్కడ వివాహ సాంప్రదాయల్లో భాగంగా వధువు నోటిలో పాన్ ఉంచుతారు. వరుడు దాన్ని చేతితో తాకకుండా పాన్‌ను వధువు నోటిలో నుంచి తీయాలి. కాబట్టి వరుడు వధువు నోటి నుంచి పాన్ లాగడానికి ప్రయత్నించినప్పుడు, అతను ఆమెను ముద్దు పెట్టుకుంటాడు.ఈ సన్నివేశాన్ని అక్కడ ఉన్న వారు చాలా మంది తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో హల్చల్ చేస్తుంది. View this post on Instagram A post shared by Niranjan Mahapatra (@official_niranjanm87) -
దారుణం : పెళ్ళిలో డ్యాన్స్ చేసిందని భార్యను చంపేశారు!
సాక్షి, కోల్‌కతా : ఓ భర్త వివాహ వేడుకలో డ్యాన్స్ చేసిందనే అక్కసుతో తన భార్యను దారుణంగా చంపేశాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ 24 పరగణాల జిల్లాలోని బసంతిలో చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే..స్వప్న (18)అనే యువతికి సుబీర్ నష్కర్ అనే వ్యక్తితో ఇటీవలే వివాహం జరిగింది. అయితే శనివారం తమ బంధువుల వివాహా వేడుకకు సుబీర్, స్వప్న తమ తల్లిదండ్రలతో కలిసి వెళ్లారు. అక్కడ స్వప్న కొంత మంది యువకులతో కలిసి డ్యాన్స్ చేసింది. అది సుబీర్‌కు నచ్చలేదు. దీంతో సుబీర్ అందరి ముందే భార్యతో గొడవ పెట్టుకొన్నాడు. డ్యాన్స్ ఎందుకు చేశావని అక్కడే నిలదీశాడు. దీంతో స్వప్న అలిగి ఇంటికి వెళ్ళిపోయింది. అనంతరం తల్లితో కలిసి సుబీర్ ఇంటికి వెళ్ళిపోయాడు. కొపం తట్టుకోలేక తల్లితో కలిసి స్వప్నను గొంతు నులిమి చంపేశాడు. ఆపై తన భార్య ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా అందరిని నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే స్వప్న తల్లిదండ్రులు సుబీరే తమ కూతురిని హత్యచేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణలో అసలు విషయాలు వెలుగు చూశాయి. దీంతో సుబీర్, అతని తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పెళ్లిళ్ల మనీ విత్ డ్రాపై సవరణలు!
-
పెళ్లిళ్ల మనీ విత్ డ్రాపై సవరణలు!
ఢిల్లీ : పెళ్లిళ్లకు మనీ విత్ డ్రా మార్గదర్శకాలపై ఆర్బీఐ మంగళవారం సవరణలు చేసింది. వివాహా ఖర్చులకు పేమెంట్ చేస్తున్న వారి పేర్లతో డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే బ్యాంకు అకౌంట్ లేకుండా రూ.లక్ష వరకు ఇచ్చే పేమెంట్ల వివరాలను ఇవ్వాలని పేర్కొంది. పెళ్లి ఖర్చుల్లో దేని నిమిత్తం డబ్బు ఇస్తున్నారో కూడా డిక్లరేషన్‌లో స్పష్టంగా పేర్కొన్నాలని సూచించింది. మరోవైపు పీపీఐలకు విత్ డ్రా పరిమితులను ఆర్బీఐ పెంచింది. ప్రస్తుతమున్న రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచుతూ మంగళవారం ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. పెళ్లిళ్ల కోసం మంగళవారం నుంచి రూ.2.5 లక్షల వరకూ ఒక కుటుంబం తమ ఖాతాల నుంచి నగదు తీసుకునే సదుపాయాన్ని ఆర్బీఐ కల్పించిన విషయం తెలిసిందే. -
వివాహ వేదికపై దాడి.. 26కు పెరిగిన మృతుల సంఖ్య
సనా: యెమెన్‌లో ఓ వివాహ వేదికపై జరిగిన వైమానిక దాడిలో మరణించిన వారి సంఖ్య 26కు పెరిగింది. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మరో 40 మంది గాయపడ్డారు. బుధవారం రాత్రి దమర్ ప్రావిన్స్‌లో ఓ గిరిజన నాయకుడి ఇంట్లో పెళ్లి జరుగుతున్న సమయంలో యుద్ధ విమానాలు దాడి చేశాయి. ఆయన షీటె హౌతీ గ్రూప్‌నకు మద్దతుదారు. యెమెన్‌లో గతవారం మరో పెళ్లి బృందంపై వైమానిక దాడి జరిగింది. -
పెళ్లి బృందంపై దాడి.. 13 మంది మృతి
సనా: యెమెన్‌లో ఓ వివాహ వేదికపై జరిగిన వైమానిక దాడిలో 13 మరణించగా, మరో 38 మంది గాయపడ్డారు. దమర్ ప్రావిన్స్‌లో ఓ ఇంట్లో పెళ్లి జరుగుతున్న సమయంలో బాంబు దాడి చేశారు. ఈ దాడి ఎవరు చేశారన్నది తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. -
‘ఏడడుగుల వేడుక’కు 9 నెలల విరామం
అన్నవరం: పుష్కరాలకు ముందూ, ఆ తరువాతా గోదావరి అలల గలగలలు వినిపిస్తాయి. అయితే ఆ పుష్కరాల కారణంగా.. ఆ మహాపర్వానికి ఓ నెల ముందూ, తరువాత ఎనిమిది నెలలూ ఈ ప్రాంతంలో మంగళవాయిద్యాలు వినిపించవు. జూలై 14 నుంచి 25 వరకూ జరగనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఈ ఏడాది వివాహ ముహూర్తాలు జూన్ 11తో ముగుస్తున్నాయి. ఆనాటి నుంచి తిరిగి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకూ పెళ్లి ముహూర్తాలు ఉండవు. ఆ వ్యవధిలో ముఖ్యంగా గోదావరి పరీవాహక ప్రాంతంలో పెళ్లిళ్లు నిషిద్ధమని పండితుల్లో అనేకులు చెపుతున్నారు. దీంతో జూన్ 11 లోపునే వివాహాలు చేసేందుకు పెళ్లీడు యువతీయువకుల తల్లిండ్రులు ఆరాటపడుతున్నారు. ఈ నెల 19 న ప్రారంభమైన జ్యేష్ఠమాసం జూన్ 16 వరకూ ఉంటుంది. ఆ తర్వాత వరుసగా రెండు నెలలు ఆధిక ఆషాఢం, నిజ ఆషాఢం ఉంటారుు. ఆషాఢమాసాలు శుభకార్యాలకు పనికిరాని విషయం విదితమే. సాధారణంగా శ్రావణమాసం, ఆశ్వయుజమాసం, కార్తీకమాసం, మాఘమాసాలలో వివాహాలు జరుగుతాయి. పుష్కరాల కారణంగా ఈసారి ఈ నెలల్లో వివాహాలు జరిగే అవకాశం లేదు. ఇక జ్యేష్ఠమాసంలో కూడా వధూవరులిద్దరూ జ్యేష్టులు(సంతానంలో పెద్దవారు) అయితే నెలతో కలిసి మూడు జ్యేష్టాలు ఉన్నందున వివాహాలు చేసుకోని ఆచారం ఉన్నవారు కూడా ఉన్నారు. అందువలన ఇప్పటికే వివాహాల జోరు కొంత తగ్గింది. ఈ నెల 29న, జూన్ 11న పెద్ద ముహూర్తాలు ఈ నెలలో 28, 29, 30 జూన్ నెలలో 1, 2, 3, 6, 11 తేదీలలో వివాహ ముహూర్తాలు ఉన్నాయని పండితులు తెలిపారు. అందులో ఈనెల 29, జూన్ 11 వ తేదీ న దివ్యమైన ముహూర్తాలు ఉన్నందున ఆ రోజు భారీగా వివాహాలు జరుగుతాయన్నారు. ఆ తర్వాత ఇంక పెళ్లి బాజా మోగాలంటే సుమారు తొమ్మిది నెలలు ఆగాలని తెలిపారు. ఇదిలా ఉంటే అన్నవరం దేవస్థానంలో కూడా మే 29, జూన్ 11 తేదీల్లో దేవస్థానం సత్రాలలో గదులకు 30 శాతం రిజర్వేషన్ పూర్తయింది. పెళ్లి బృందాలకు ఒక్కో గది మాత్రమే ఇవ్వడం వివాదస్పదమవుతోంది. ఆడ, మగ పెళ్లివారికి ఒక్కో రూమ్ ఇవ్వాలని పెళ్లిబృందాల వారు కోరుతున్నారు. అన్నవరం దేవస్థానానికీ నష్టమే.. కాగా, తొమ్మిది నెలల పాటు వివాహ ముహూర్తాలు లేకపోవడం దేవస్థానానికి కూడా నష్టమే. రత్నగిరిపై ఏటా ఐదువేలకు పైగా వివాహాలు జరుగుతాయి. ఇక్కడ వివాహాలు చేసుకునేవారితో బాటు పలు ప్రాంతాలలో వివాహాలు చేసుకునేవారు కూడా మధుపర్కాలతో వచ్చి స్వామివారి వ్రతం చేసుకుంటారు. అటువంటిది తొమ్మిది నెలలు వివాహాలు జరగకపోతే భక్తుల రాక తగ్గి ఆమేరకు దేవస్థానానికి కూడా ఆదాయం తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే రత్నగిరిపై వ్యాపారాల జోరు తగ్గింది. వేలం పాటలు పాడే వారు ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని పాడుతున్నారు. వివాహాలకు గుమ్మటాలు (చిన్న మండపాలు) వేసి అలంకరణ చేసేందుకుగాను ఈ నెల 15 న వేలం నిర్వహిస్తే నెలకు రూ.3,52,500 మాత్రమే పాట వెళ్లింది. ఇది గత ఏడాది కన్నా కేవలం రూ.500 మాత్రమే ఎక్కువ. పరిస్థితిని గమనించిన అధికారులు ఆ పాటనే ఖరారు చేయాల్సి వచ్చింది. మిగతా వేలంపాటలు కూడా తగ్గే పరిస్థితి ఉంది. వివాహాలపై ఆధారపడిన పురోహితులు, క్యాటరింగ్, సన్నాయిమేళం తదితర వర్గాల వారు కూడా ఈ తొమ్మిది నెలలు ఏమి చేయాలనే దానిపై తర్జన భర్జన పడుతున్నారు.