
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఇటీవలే ఓ ఇంటివాడైనా సంగతి తెలిసిందే. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను ప్రేమ వివాహాం చేసుకున్నారు. అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య మంచు లక్ష్మిప్రసన్న ఇంట్లో వేడుక జరిగింది. అయితే తాజాగా ఈ జంట సీనియర్ నటి సుమలత కుమారుడి పెళ్లిలో సందడి చేశారు. తాజాగా ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు మంచు లక్ష్మి తన ఇన్‌స్టాలో షేర్ చేశారు.
( ఇది చదవండి: పెళ్లి పార్టీలో డ్యాన్స్‌తో దుమ్ములేపిన సుమలత, యశ్)
అయితే ఈ పెళ్లికి సతీసమేతంగా హాజరైన మంచు మనోజ్ - భూమా మౌనిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా భూమా మౌనిక సినీతారల మధ్య చాలా ఫ్యాషన్‌గా కనిపించారు. ఎప్పుడు సంప్రదాయ దుస్తుల్లోనే కనిపించిన మౌనికను అలా సినీ తారల మధ్య చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
కాగా.. ఫిల్మ్ ఇండస్ట్రీ సీనియర్ నటి, కర్ణాటక ఎంపీ సుమలత కుమారుడు అభిషేక్ వివాహం బెంగళూరులో ఘనంగా జరిగింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రసాద్ బిడపా కుమార్తె అవివాను అభిషేక్ వివాహం చేసుకున్నాడు. గ్రాండ్‌గా జరిగిన మ్యారేజ్ పార్టీలో కొత్త జంటతో కలిసి స్టార్ హీరోలు సందడి చేశారు.
( ఇది చదవండి: నాతో అసభ్యంగా ప్రవర్తించాడు.. జీర్ణించుకోలేకపోయా: ప్రగతి షాకింగ్ కామెంట్స్)
Comments
Please login to add a commentAdd a comment