
పెళ్లిళ్ల మనీ విత్ డ్రాపై సవరణలు!
ఢిల్లీ : పెళ్లిళ్లకు మనీ విత్ డ్రా మార్గదర్శకాలపై ఆర్బీఐ మంగళవారం సవరణలు చేసింది. వివాహా ఖర్చులకు పేమెంట్ చేస్తున్న వారి పేర్లతో డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది.
అలాగే బ్యాంకు అకౌంట్ లేకుండా రూ.లక్ష వరకు ఇచ్చే పేమెంట్ల వివరాలను ఇవ్వాలని పేర్కొంది. పెళ్లి ఖర్చుల్లో దేని నిమిత్తం డబ్బు ఇస్తున్నారో కూడా డిక్లరేషన్‌లో స్పష్టంగా పేర్కొన్నాలని సూచించింది. మరోవైపు పీపీఐలకు విత్ డ్రా పరిమితులను ఆర్బీఐ పెంచింది. ప్రస్తుతమున్న రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచుతూ మంగళవారం ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. పెళ్లిళ్ల కోసం మంగళవారం నుంచి రూ.2.5 లక్షల వరకూ ఒక కుటుంబం తమ ఖాతాల నుంచి నగదు తీసుకునే సదుపాయాన్ని ఆర్బీఐ కల్పించిన విషయం తెలిసిందే.