'ప్రైవసీకి భంగం'.. ఫోటోలు లీకవడంపై ఆగ్రహం | Shaheen Afridi Fires At Wedding Leaks Says Our Privacy Was Hurt | Sakshi
Sakshi News home page

Shaheen Afridi: 'ప్రైవసీకి భంగం'.. ఫోటోలు లీకవడంపై ఆగ్రహం

Feb 5 2023 11:04 AM | Updated on Feb 5 2023 11:41 AM

Shaheen Afridi Fires At Wedding Leaks Says Our Privacy Was Hurt - Sakshi

పాకిస్తాన్‌ యంగ్‌ క్రికెటర్‌ షాహిన్‌ అఫ్రిది మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది కూతురు అన్షా అఫ్రిదిని వివాహమాడిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 3న కుటుంబసభ్యుల సమక్షంలో వీరి నిఖా జరిగింది. ఇస్లాం మతం ప్రకారం పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు రిలీజ్‌ చేయలేదు. కానీ పెళ్లికి హాజరయిన వాళ్లలో కొంతమంది పెళ్లి ఫోటోలు తీసి సోషల్‌ మీడియలో షేర్‌ చేయడంతో వైరల్‌ అయ్యాయి. ఫోటోలు లీక్‌ కావడంపై తాజాగా షాహిన్‌ అఫ్రిది ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ''ముందుగా విషెస్‌ తెలిపినందుకు మీకందరికి ధన్యవాదాలు. అయితే ఒక విషయం తీవ్రంగా నిరాశపరిచింది. అనుమతి లేకుండా మా పెళ్లికి సంబంధించిన ఫోటోలు లీక్‌ చేయడం బాధించింది. ఆ ఫోటోలు మా ప్రైవసీకి భంగం కలిగించేలా ఉన్నాయి. మీకందరికి ఒక విజ్ఞప్తి. మళ్లీ ఇలాంటివి రీపీట్‌ కాకూడదని కోరుకుంటున్నా. మాకు సహకరిస్తారని ఆశిస్తున్నా. మాకు మంచి మొమోరబుల్‌ అయిన పెళ్లి వేడుకను దయచేసి స్పాయిల్‌ చేయొద్దు'' అని చెప్పుకొచ్చాడు.

కాగా షాహిన్‌ అఫ్రిది వివాహ వేడుకకు పలువురు పాక్‌ క్రికెటర్లు హాజరయ్యారు. బాబర్‌ ఆజం, షాదాబ్‌ఖాన్‌, ఫఖర్‌ జమాన్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌ తదితరులు హాజరయ్యారు. ఇక మోకాలి గాయం సర్జరీ తర్వాత టి20 ప్రపంచకప్‌లో ఆడినప్పటికి అఫ్రిది అంతగా ప్రభావం చూపించలేకపోయాడు. కాగా వివాహానికి కొద్ది రోజుల ముందు వరకు బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడిన అఫ్రిది ఫిబ్రవరి 13 నుంచి జరగనున్న  పీఎస్‌ఎల్‌ ఎనిమిదో ఎడిషన్‌లో లాహోర్‌ ఖలండర్స్‌  తరపున ఆడనున్నాడు. 

చదవండి: షాహీన్‌తో కుమార్తె వివాహం.. ఆఫ్రిది భావోద్వేగం! ట్వీట్‌ వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement