ఒమన్ పేసర్ బిలాల్ ఖాన్ వన్డేల్లో తిరుగులేని రికార్డు నెలకొల్పాడు. అత్యంత వేగంగా 100 వికెట్ల మైలురాయిని అందుకున్న పేస్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బిలాల్‌కు ముందు ఈ రికార్డు పాక్ స్పీడ్‌స్టర్ షాహీన్ అఫ్రిది పేరిట ఉండేది. షాహీన్ 51 మ్యాచ్‌ల్లో 100 వికెట్ల మైలురాయిని తాకగా.. బిలాల్ కేవలం 49 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా (పేసర్లు, స్పిన్నర్లు) వన్డేల్లో ఫాస్టెస్ 100 వికెట్స్ రికార్డు నేపాల్ బౌలర్ సందీప్ లామిచ్చేన్ పేరిట ఉంది. లామిచ్చేన్ కేవలం 42 మ్యాచ్‌ల్లోనే 100 వికెట్ల మైలురాయిని తాకాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్-2 మ్యాచ్‌ల్లో భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టడం ద్వారా బిలాల్ వన్డేల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో నమీబియాపై ఒమన్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయగా.. ఒమన్ 49.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నమీబియా ఇన్నింగ్స్‌లో మలాన్ క్రుగెర్ (73) అర్ద సెంచరీతో రాణించగా.. ఆకిబ్ ఇలియాస్ (68), ఖలీద్ కైల్ (43) ఒమన్‌ను గెలిపించారు. ఒమన్ బౌలర్లలో బిలాల్ ఖాన్ 3, ఫయాజ్ భట్ 2, కలీముల్లా, జే ఒడేడ్రా, షోయబ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టగా.. నమీబియా బౌలర్లలో జాక్ బ్రసల్ 2, బెన్ షికోంగో, తంగెని లుంగమెని తలో వికెట్ దక్కించుకున్నారు.
వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన పేసర్లు
బిలాల్ ఖాన్- 49 మ్యాచ్‌లు
షాహీన్ అఫ్రిది- 51
మిచెల్ స్టార్క్- 52
షేన్ బాండ్- 54
ముస్తాఫిజుర్ రెహ్మాన్- 54
వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్లు
సందీప్ లామిచ్చేన్- 42
రషీద్ ఖాన్- 44
బిలాల్ ఖాన్- 49
షాహీన్ అఫ్రిది- 51
మిచెల్ స్టార్క్- 52
Comments
Please login to add a commentAdd a comment