Rakul Preet Singh Spotted At Wedding Reception With Boy Friend Jackky, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Rakul Preet Singh: వెడ్డింగ్‌లో సందడి చేసిన ప్రేమ జంట.. వీడియో వైరల్!

Published Mon, Jun 12 2023 1:24 PM | Last Updated on Mon, Jun 12 2023 1:46 PM

Rakul Preet Singh Spotted At Wedding Reception With Boy Friend Jackky - Sakshi

రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. శాండల్‌వుడ్‌లో కెరీర్‌ ప్రారంభించిన ముద్దుగుమ్మ తెలుగులో కెరటం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అగ్రహీరోల సరసన నటించింది.

లౌక్యం, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, నాన్నకు ప్రేమతో, సరైనోడు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో కనిపించింది. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్‌లో బిజీగా మారిపోయింది. గతేడాది ఛత్రివాలి సినిమాతో ప్రేక్షకుల అలరించిన భామ.. తాజాగా 'బూ' అనే హార్రర్ చిత్రంతో ముందుకొచ్చింది.

(ఇది చదవండి: పెళ్లి వేడుకల్లో మనోజ్- మౌనిక.. ఆమెను ఇలా ఎప్పుడైనా చూశారా? )

అయితే తాజాగా ముంబయిలో జరిగిన ప్రముఖ నిర్మాత మధు మంతెన పెళ్లిలో తళుక్కున మెరిసింది. తన ప్రియుడు, నిర్మాత జాకీ భగ్నానితో కలిసి వెడ్డింగ్‌ వేడుకల్లో సందడి చేసింది. కాగా.. 2021లో రకుల్ ప్రీత్ సింగ్ బర్త్‌డే సందర్భంగా జాకీ భగ్నానీ ఇన్‌స్టాగ్రామ్‌లో విష్ చేయడంతో డేటింగ్‌ రూమర్స్ వైరలైన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత పలు సందర్భాల్లో వీరిద్దరు జంటగా కనిపించారు. తాజాగా మరోసారి బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి నిర్మాత మధుమంతెన- ఐరా త్రివేది పెళ్లిలో సందడి చేసింది. దీంతో ఈ ప్రేమజంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

(ఇది చదవండి: నాతో అసభ్యంగా ప్రవర్తించాడు.. జీర్ణించుకోలేకపోయా: ప్రగతి షాకింగ్ కామెంట్స్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement