కోల్‌కతా: దేశమంతటా ఎన్నికల వేడి రాజుకుంది. లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. పోలింగ్‌కు సమయం సమీపిస్తుండటంతో నువ్వానేనా అన్నట్లుగా అధికార ప్రతిపక్షాలు ప్రచార జోరు పెంచాయి. ఓటర్లను ఆకర్షించుకునేందుకు విభిన్న రీతిలో ప్రచారం చేస్తూ హోరెత్తిస్తున్నారు.
తాజాగా పశ్చిమబెంగాల్‌లో ఓ బీజేపీ అభ్యర్ధి నిర్వహించిన ప్రచారం వివాదంలో చిక్కుకుంది.బెంగాల్ నార్త్ మల్దా నియోజవర్గం బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము.. మరోసారి పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇటీవల ఆయన తన నియోజకవర్గ పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఖగేన్.. ఓయువతి చెంపపై ముద్దు పెట్టాడు. చంచల్ శ్రిహిపూర్ గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది.
ప్రచారంలో భాగంగా ఖగేన్ ముర్ము యువతికి ముద్దు పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ ఘటన రాజకీయ దుమారాన్ని రేపింది.దీనిపై అధికార తృణమూల్ కాంగ్రెస్ స్పందిస్తూ బీజేపీపై విరుచుకుపడింది. కాషాయ పార్టీలో మహిళా వ్యతిరేక రాజకీయ నాయకులకు కొదవేలేదని విమర్శలు గుప్పించింది.
‘బీజేపీ ఎంపీ బెంగాల్‌లోని ఉత్తర మాల్దా అభ్యర్ధి ఖగేన్ ముర్మూ తన ప్రచారంలో ఓ మహిళకు ముద్దు పెట్టారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించే ఎంపీల నుంచి.. బెంగాలీ మహిళలపై అశ్లీల పాటలు రాసేటటువంటి నేతలు.. బీజేపీ శిబిజరంలో మహిళా వ్యతిరేక రాజకీయ నాయకులకు కొదవే లేదు. నారీమణులకు ‘మోదీ పరివార్’ ఇస్తున్న గౌరవం ఇది. ఒకవేళ వారు అధికారంలోకి వస్తే ఇలాంటివి ఇంకెన్ని చేస్తారో ఊహించుకోండి’ అంటూ ఎక్స్ వేదికగా మండిపడింది.
అయితే ఖగేన్ ముర్మూ తన చర్యలను సమర్ధించుకున్నారు. ఆమెను తన కుమార్తెలా భావించి, ముద్దు పెట్టినట్లు తెలిపారు. పిల్లలకు ముద్దు పెడితే తప్పేంటని ప్రశ్నించారు. కుట్రపూరితంగా దీనిపై వివాదం సృష్టిస్తున్నారని విమర్శించారు.
చదవండి: పతంజలి కేసు.. ‘క్షమాపణలు అంగీకరించం.. చర్యలు తప్పవు’
Comments
Please login to add a commentAdd a comment