Last-Minute Stunner Gets Footballer Lip-to-Lip Kiss From Team-Mate Viral - Sakshi
Sakshi News home page

మ్యాచ్‌ గెలిచిన సంతోషం ముద్దుతో ఉక్కిరిబిక్కిరి; ట్విస్ట్‌ ఏంటంటే

Published Thu, Apr 7 2022 5:22 PM | Last Updated on Thu, Apr 7 2022 7:55 PM

Last-Minute Stunner Gets Footballer Lip-to-Lip Kiss From Team-Mate Viral - Sakshi

మ్యాచ్‌ గెలిచిన సంతోషంలో సెలబ్రేట్‌ చేసుకోవడం సహజం. ఆ సెలబ్రేషన్‌ చేసుకునే విధానంలో ఒక్కో ఆటగాడికి ఒక్కో శైలి ఉంటుంది. అయితే ఎవరు ఊహించని విధంగా తమ సంతోషాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నారు ఇద్దరు ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు. విషయంలోకి వెళితే.. ఇంగ్లండ్‌ వేదికగా ఎఫ్‌ఏ ట్రోపీ పేరిట టోర్నీ జరుగుతుంది. టోర్నీలో భాగంగా బుధవారం వ్రెక్స్‌హమ్‌ ఏఎఫ్‌సీ, స్టాక్‌పోర్ట్‌ కంట్రీ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయానికి ఏ జట్టు గోల్‌ చేయలేకపోయింది.

దీంతో అదనపు సమయంలో వ్రెక్స్‌హమ్‌కు చెందిన ముల్లిన్‌ గోల్‌ కొట్టి 1-0-తో ఆధిక్యంలోకి తెచ్చాడు. ఆ తర్వాత మరో నాలుగు నిమిషాలకే మరో గోల్‌ కొట్టి 2-0తో జట్టును గెలిపించాడు. మ్యాచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన ముల్లిన్‌ను అంతా అభినందిస్తుంటే.. తన సహచర ఆటగాడు పామర్‌ మాత్రం వేలాది మంది అభిమానుల సమక్షంలో అతని మెడను పట్టుకొని ఎవరు ఊహించని విధంగా లిప్‌ టూ లిప్‌ కిస్‌ ఇచ్చాడు. ఈ సన్నివేశాన్ని చూసి తోటి ఆటగాళ్లు సహా అభిమానులు షాక్‌కు గురయ్యారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియలో వైరల్‌గా మారింది. ''అతనేమైనా అమ్మాయా.. ముద్దు పెట్టుకోవడానికి.. ఎంత మ్యాచ్‌ గెలిస్తే మరి ఇంత ఘాటు ముద్దా'' అంటూ కామెంట్‌ చేశారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన వ్రెక్స్‌హమ్‌పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురిశాయి. వరుసగా 21 మ్యాచ్‌ల పాటు ఓటమి ఎరుగని స్టాక్‌పోర్ట్‌ కంట్రీకి వ్రెక్స్‌హమ్‌ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది.

చదవండి: కబడ్డీ ప్లేయర్‌ దారుణ హత్య.. 20 రోజుల్లో 20 మంది..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement