
ముద్దు ఖరీదు 15 లక్షలు!
నటిగా, గాయనిగా, దర్శకురాలిగా.. ఇలా సినిమా రంగానికి చెందిన వివిధ శాఖల్లో దూసుకెళుతున్న డయన్న అగ్రాన్‌కి హాలీవుడ్‌లో చాలా క్రేజ్ ఉంది.
నటిగా, గాయనిగా, దర్శకురాలిగా.. ఇలా సినిమా రంగానికి చెందిన వివిధ శాఖల్లో దూసుకెళుతున్న డయన్న అగ్రాన్‌కి హాలీవుడ్‌లో చాలా క్రేజ్ ఉంది. పాత్ర డిమాండ్ చేస్తే.. హద్దులు దాటడానికి వెనకాడని డయన్న... సేవా కార్యక్రమాల విషయంలో కూడా హద్దులు పెట్టుకోరు. అందుకు తాజా నిదర్శనంగా ఓ కార్యక్రమాన్ని చెప్పుకోవచ్చు. ‘వార్ చైల్డ్’ అనే సంస్థ నిధి సమకూర్చుకోవాలనుకుంది. అందుకు గాను డయన్న సహాయం కోరింది.
ఇందులో భాగంగా డయన్న ఓ వ్యక్తికి ముద్దుపెట్టాలి. ఆ ముద్దు అందుకున్న వ్యక్తి దాదాపు 15 లక్షలివ్వాలన్నమాట. అంటే.. ఒక రకంగా డయన్న తన ముద్దుని అమ్ముకున్నట్లన్న మాట. పిల్లల సంక్షేమార్థం వార్ చైల్డ్ చేస్తున్న కృషిని గుర్తించిన డయన్న ఈ ప్రతిపాదనను అంగీకరించారు. దీనికి సంబంధించి స్విట్జర్లాండ్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అతిథిని ముద్దాడారు డయన్న. దాని ద్వారా వచ్చిన డబ్బుని వార్ చైల్డ్ సంస్థకు ఇచ్చారు.