తీర్థాన్ని ఎలా తీసుకోవాలి? ఇతర నియమాలు | Holy Water : Theertham importance and how to receive | Sakshi
Sakshi News home page

తీర్థాన్ని ఎలా తీసుకోవాలి? ఇతర నియమాలు

Published Thu, Nov 7 2024 12:14 PM | Last Updated on Thu, Nov 7 2024 12:33 PM

Holy Water : Theertham importance and how to receive

గుడికి వెళ్తే ప్రసాదం తీసుకున్నా లేకున్నా తీర్థం తప్పకుండా తీసుకుంటాం. పూజారిగారు మరేదో వ్యాపకంలో ఉన్నా అడిగి మరీ తీసుకుంటాం. తీర్థం అంత అమూల్యమైంది, శ్రేష్ఠమైంది.

  • తీర్థం తీసుకునేటప్పుడు కుడిచేతిని గోకర్ణంలా (ఆవు చెవి ఆకృతి) పెట్టాలి. 
  • అంటే చేతిని డిప్పలా ముడిచి, చూపుడు వేలును బొటనవేలుకు ఆనించాలి. 
  • అంతే తప్ప ఒక చేయి, లేదా రెండు చేతులను దోసిళ్ళలా పట్టకూడదు.
  • ఉద్ధరణితో మూడుసార్లు తీర్థం పోసిన తర్వాత కళ్ళకు అద్దుకుని తాగాలి. 
  • తీర్థం తాగేటప్పుడు నిలబడకూడదు. కూర్చుని మాత్రమే సేవించాలి. 
  • తీర్థం తీసుకునేటప్పుడు జుర్రిన శబ్దం రాకూడదు.
  • మనసులో దేవుని స్మరించుకుంటూ నిశ్శబ్దంగా సేవించాలి.

కొన్ని ఎప్పటికీ ఆచరించవలసిన నియమాలు

  • అన్నం తింటున్నప్పుడు అన్నాన్ని, ఆ అన్నం పెట్టువారిని తిట్టటం, దుర్భాషలాడటం చేయరాదు. 
  • ఏడుస్తూ తినడం, గిన్నె / ఆకు మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదు
  • ఒడిలో కంచం, పళ్ళెం పెట్టుకుని అన్నం తినరాదు. 
  • భోజనసమయంలో నవ్వులాట, తగువులాట, తిట్టుకొనటం, గేలిచేయటం నష్టదాయకం. 
  • భోజనానంతరం ఎంగిలి ఆకులు / కంచాలు ఎత్తేవారికి వచ్చే పుణ్యం, అన్నదాతకు కూడా రాదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement