హైదరాబాద్: ఐస్ క్రీమ్స్ తయారీలో ఉన్న ఎన్‌ఐసీ హానెస్ట్‌లీ క్రాఫ్టెడ్ ఐసీ క్రీమ్స్ హోలీ పండుగను దృష్టిలో పెట్టుకుని థండాయ్ ఫ్లేవర్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే కంపెనీ పాన్, గులాబ్ జామూన్, గాజర్ హల్వా, మోదక్, షీర్ ఖుర్మా, తిల్ గుడ్ వంటి 50కిపైగా ఫ్లేవర్లను విక్రయిస్తోంది. 2015లో ప్రారంభమైన ఎన్‌ఐసీ హానెస్ట్‌లీ క్రాఫ్టెడ్ ఐసీ క్రీమ్స్‌ను వాకో ఫుడ్ కంపెనీ ప్రమోట్ చేస్తోంది.
భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐస్‌క్రీం బ్రాండ్ ఎన్‌ఐసీ హానెస్ట్‌లీ క్రాఫ్టెడ్ ఐసీ క్రీమ్స్ ఇటీవల వాఫిల్ కోన్స్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. వాఫిల్ కోన్‌లు 5 ప్యాక్‌లలో లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment