NIC
-
భారతీయ డిజైనర్ రూపొందించిన గౌనులో ఐరిష్ నటి..క్యూట్ బబ్లీ లుక్స్..!
-
ఎన్ఐసీ చేతికి ‘ధరణి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూముల రికార్డులను నిర్వహిస్తున్న ధరణి పోర్ట ల్ను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ ఇన్ఫర్మే టిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ధరణి పోర్టల్‌ను నిర్వహిస్తున్న టెరాసస్ కంపెనీ గడువు ఈనెల 29తో ముగియనున్న నేపథ్యంలో రానున్న మూడేళ్లపాటు ఈ బాధ్యతను ఎన్ఐసీకి అప్పగిస్తు న్నట్లు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. టెరాసస్ నుంచి పోర్టల్ నిర్వహణ చేపట్టేందుకు నెల రోజుల సమ యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది నవంబర్ 30 నుంచి మూడేళ్లపాటు ధరణి పోర్టల్‌ను ఎన్ఐసీ అధికారికంగా నిర్వహించనుంది. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత 2020 అక్టోబర్ 29 నుంచి ఐఎల్ఎఫ్ఎస్ (ఆ తర్వాత టెరాసస్గా మారింది)కు రికార్డుల నిర్వహణ బాధ్యత అప్పగించగా నాలుగేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం పరిధిలో పనిచేసే ఎన్ఐసీకి తెలంగాణలోని భూముల రికార్డుల బాధ్యత అప్పగించడం గమనార్హం. ఈ మార్పుపై ఈ నెల 26న జరిగే కేబినెట్ భేటీలోనూ చర్చించనున్నట్లు రెవెన్యూ వర్గాలంటున్నాయి. దీంతోపాటు కొత్త రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) చట్టం ముసాయిదాపైనా మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామా నికి రెవెన్యూ సిబ్బంది ఉండేలా మొత్తం 10,954 భూరక్షక్ (పేరు అధికారికంగా నిర్ణయించాల్సి ఉంది) పోస్టులకు కూడా మంత్రివర్గం అనుమతివ్వను ందని రెవెన్యూ వర్గాలు పేర్కొన్నాయి.స్వదేశీ సంస్థ చేతుల్లోకి ‘ధరణి’: పొంగులేటిఇప్పటివరకు విదేశీ çకంపెనీ అయిన టెరాసస్ చేతిలో ఉన్న ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతను స్వదేశీ సంస్థ అయిన ఎన్ఐసీకి అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు తొందరపాటు నిర్ణయాలతో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ కారణంగా తెలంగాణ రైతాంగం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొందని... తెలంగాణలోని 1.56 కోట్ల ఎకరాల భూమిని విదేశీ కంపెనీకి తాకట్టు పెట్టారని పొంగులేటి ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు భూరికా ర్డుల నిర్వహణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థకు అప్పగించామని పేర్కొన్నారు. తద్వారా రాష్ట్రంలోని 71 లక్షల మంది రైతుల ఖాతాల్లోని భూములకు రక్షణ ఏర్పడిందన్నారు. త్వరలోనే ధరణి సమస్యల నుంచి తెలంగాణ రైతాంగానికి విముక్తి కల్పిస్తామన్నారు. -
ఐస్ క్రీం లవర్స్‌కి చల్లటివార్త: థండాయ్ ఐస్ క్రీం
హైదరాబాద్: ఐస్ క్రీమ్స్ తయారీలో ఉన్న ఎన్ఐసీ హానెస్ట్లీ క్రాఫ్టెడ్ ఐసీ క్రీమ్స్ హోలీ పండుగను దృష్టిలో పెట్టుకుని థండాయ్ ఫ్లేవర్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే కంపెనీ పాన్, గులాబ్ జామూన్, గాజర్ హల్వా, మోదక్, షీర్ ఖుర్మా, తిల్ గుడ్ వంటి 50కిపైగా ఫ్లేవర్లను విక్రయిస్తోంది. 2015లో ప్రారంభమైన ఎన్ఐసీ హానెస్ట్లీ క్రాఫ్టెడ్ ఐసీ క్రీమ్స్‌ను వాకో ఫుడ్ కంపెనీ ప్రమోట్ చేస్తోంది. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐస్‌క్రీం బ్రాండ్ ఎన్ఐసీ హానెస్ట్లీ క్రాఫ్టెడ్ ఐసీ క్రీమ్స్ ఇటీవల వాఫిల్ కోన్స్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. వాఫిల్ కోన్లు 5 ప్యాక్‌లలో లభిస్తాయి. -
ప్రతి కదలిక.. తెలిసిపోతుందిక..
సాక్షి, అమరావతి: అక్రమ రవాణాను అరికట్టడం, రహదారి భద్రత దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని ప్రయాణ, సరుకు రవాణా వాహనాల గమనాన్ని ట్రాకింగ్ చేసే వ్యవస్థను నెలకొల్పనుంది. అందుకోసం అన్ని వాహనాలకు ట్రాకింగ్ పరికరాల ఏర్పాటును తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. వాహనాల ట్రాకింగ్‌ను పర్యవేక్షించేందుకు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)తో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనుంది. రాష్ట్రంలో దాదాపు 1.52 కోట్ల వాహనాలున్నాయి. వాటిలో రవాణాయేతర (వ్యక్తిగత) వాహనాలు 1.35 కోట్ల వరకు ఉంటాయని అంచనా. మిగిలిన దాదాపు 17 లక్షల వాహనాలు వాణిజ్య వాహనాలు. వాటిలో ప్రయాణ వాహనాలు, సరుకు రవాణా వాహనాలు ఉన్నాయి. ఈ 17 లక్షల వాహనాలకు ట్రాకింగ్ పరికరాల ఏర్పాటును ప్రభుత్వం తప్పనిసరి చేయనుంది. కేంద్ర రవాణాశాఖ తాజా మార్గదర్శకాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకుంది. వాహనాలకు ట్రాకింగ్ పరికరాల ఏర్పాటును 2023 ఏప్రిల్ నుంచి దశలవారీగా అమలు చేయాలని రవాణాశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. మొదట ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల బస్సులకు ట్రాకింగ్ పరికరాలు అమరుస్తారు. ట్రాకింగ్ విధానాన్ని పర్యవేక్షిస్తారు. లోటుపాట్లు ఉంటే సరిచేసిన అనంతరం అన్ని ప్రయాణ, సరుకు రవాణా వాహనాలకు ట్రాకింగ్ పరికరాలు ఏర్పాటుచేస్తారు. 2024 జనవరి నాటికి రాష్ట్రంలో అన్ని వాహనాలకు ట్రాకింగ్ పరికరాల ఏర్పాటు పూర్తిచేయాలని రవాణాశాఖ భావిస్తోంది. 24/7 పర్యవేక్షణ ట్రాకింగ్ పరికరాలు ఏర్పాటు చేసిన వాహనాల ట్రాకింగ్‌ను 24/7 పర్యవేక్షించేందుకు రాష్ట్రస్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఐసీతో రవాణాశాఖ త్వరలో ఒప్పందం చేసుకోనుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు రూ.20 కోట్లు వెచ్చించనున్నారు. వాహనాల ట్రాకింగ్‌ను పకడ్బందీగా పర్యవేక్షించేందుకు అవసరమైన ఆధునిక సమాచార సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు అక్కడ విధులు నిర్వర్తించే ఉద్యోగులకు ఎన్ఐసీ శిక్షణ ఇస్తుంది. అక్రమాలు, నేరాలకు అడ్డుకట్ట అక్రమ రవాణాను అరికట్టడం, రహదారి భద్రత కోసమే ట్రాకింగ్ పరికరాల ఏర్పాటును తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రాకింగ్ పరికరం ఏర్పాటుతో వాహనాలు ఏ మార్గంలో ఏ సమయంలో ఎంతవేగంతో ప్రయాణిస్తోంది పర్యవేక్షించవచ్చు. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న వాహనాలను గుర్తించి సంబంధిత ప్రాంతంలోని పోలీసు, రవాణాశాఖ అధికారులను అప్రమత్తం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ విషయమై ఆ వాహనాల యజమానులకు సమాచారం ఇస్తారు. దీంతో యజమానులు తమ డ్రైవర్‌కు ఫోన్‌చేసి వేగాన్ని నియంత్రించమని ఆదేశించేందుకు అవకాశం ఉంటుంది. వాహనాల యజమానులు కూడా తమంతట తాముగా ఆ వాహనాల ట్రాకింగ్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. ఇక అక్రమ రవాణాను సమర్థంగా అరికట్టేందుకు ఈ ట్రాకింగ్ వ్యవస్థ ఉపయోగపడుతుంది. స్మగ్లింగ్, ఇతర దందాల్లో ఉపయోగించే వాహనాలు ఏయే మార్గాల్లో ప్రయాణించిందీ, అక్రమంగా తరలించే సరుకును ఇతర వాహనాల్లోకి మార్చినా ఇట్టే కనిపెట్టవచ్చు. అక్రమ రవాణా దందాకు కేంద్రస్థానం, వాటి గమ్యస్థానాన్ని కూడా గుర్తించవచ్చు. ఇక కిడ్నాప్‌లు, ఇతర నేరాల్లో నేరస్తులు ఉపయోగించే వాహనాల గమనాన్ని గుర్తించి సంబంధిత ప్రాంతంలో పోలీసులను అప్రమత్తం చేయవచ్చు. కేసు విచారణలో ట్రాకింగ్ రికార్డును సాక్ష్యాధారాలుగా సమర్పించవచ్చు. ఇది దోషులకు శిక్షలు విధించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. గుర్తింపు పొందిన డీలర్ల ద్వారానే విక్రయం రాష్ట్రంలో ప్రయాణ, సరుకు రవాణా వాహనాలకు అవసరమైన ట్రాకింగ్ పరికరాల సరఫరాకు రవాణాశాఖ కసరత్తు మొదలు పెట్టింది. వాహన యజమానులు తమ వాహనాలకు ట్రాకింగ్ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలి. గుర్తింపు పొందిన డీలర్ల నుంచే ట్రాకింగ్ పరికరాలు కొనుగోలు చేయాలని స్పష్టం చేయనుంది. తగిన నాణ్యత ప్రమాణాలతో ట్రాకింగ్ పరికరాలను సరఫరాచేసే డీలర్లకు రవాణాశాఖ గుర్తింపునిస్తుంది. ఒక ట్రాకింగ్ పరికరం ధర రూ.4 వేల నుంచి రూ.5 వేలలోపు ఉండేలా చూడాలని భావిస్తోంది. వాహన యజమానులకు పెద్దగా ఆర్థికభారం లేకుండానే ఈ విధానాన్ని సక్రమంగా అమలు చేయాలన్నది రవాణాశాఖ ఉద్దేశం. -
పహాణీ.. ఏడేళ్ల పరేషానీ!
సాక్షి, హైదరాబాద్: పహాణీ.. అత్యంత కీలకమైన ఓ భూ రికార్డు. సర్వే నంబర్, సబ్ డివిజన్ నంబర్లలో ఉండే భూమి విస్తీర్ణం, యజమాని పేరు, హక్కులు సంక్రమించిన విధానం, భూమి రకం లాంటి వివరాలన్నీ ఇందులో ఉంటాయి. బ్యాంకులు ఇచ్చే తనఖా రుణాలు, టైటిల్ క్లియరెన్స్‌లు, కోర్టు కేసుల విషయంలో ఇది ప్రధాన భూమిక పోషిస్తుంది. యాజమాన్య హక్కుల కల్పనకు దీనిని మాతృకగా పరిగణిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పహాణీలకు సంబంధించిన ఏడేళ్ల రికార్డులు అందుబాటులో లేకపోవడం రెవెన్యూ యంత్రాంగానికి తలనొప్పులు తెచ్చి పెడుతోంది. 2011 నుంచి 2018 వరకు తయారైన కంప్యూటరైజ్డ్ పహాణీలను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకపోవడంతో సమస్యలు వస్తున్నాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. 2018 నుంచి భూరికార్డుల ప్రక్షాళన ద్వారా సేకరించిన రికార్డులు అందుబాటులో ఉన్నా అంతకుముందు ఏడేళ్ల పహాణీలు లేకపోవడంతో చాలా సమస్యలు పరిష్కారం కాక పెండింగ్ జాబితాలోనే ఉండిపోతున్నాయి. 2011 వరకు కాగితాల్లోనే.. ప్రతి రెవెన్యూ గ్రామానికి పహాణీలు తయారు చేయడం దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో భూరికార్డులకు 1954–55 పహాణీలను కీలక ఆధారంగా రెవెన్యూ శాఖ పరిగణిస్తోంది. అప్పటి నుంచి 2004 వరకు ప్రతియేటా రెవెన్యూ వర్గాలు గ్రామ పహాణీలను మాన్యువల్‌గా తయారు చేశాయి. అయితే ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి కంప్యూటరైజ్డ్ పహాణీల తయారీ ప్రారంభమైంది. పైలట్‌గా చేపట్టిన ఈ ప్రక్రియలోనే కొన్ని సమస్యలు ఎదురుకావడంతో 2011 వరకు రెవెన్యూ యంత్రాంగం ప్రతి ఏటా మాన్యువల్ పహాణీలు రాసింది. తర్వాత మాన్యువల్ పహాణీలు రాయవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో 2011–12 నుంచి కాగితపు పహాణీలు రాయడం మానేశారు. అప్పటి నుంచి కంప్యూటర్లోనే ఈ పహాణీ రికార్డులు రూపొందించేవారు. 2011 నుంచి 2018 వరకు జరిగిన ఈ ప్రక్రియను జాతీయ స్థాయి సంస్థ అయిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) నిర్వహించింది. 2018లో భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం (ఎల్‌ఆర్‌యూపీ) ప్రారంభం కావడంతో అప్పటినుంచి మిగతా భూరికార్డులతో పాటు పహాణీలను ఎల్‌ఆర్‌యూపీ పోర్టల్‌లో నిక్షిప్తం చేశారు. ఇక 2020 నవంబర్‌లో ధరణి పోర్టల్ అందుబాటులోకి రావడంతో ఎల్‌ఆర్‌యూపీ పోర్టల్ డేటా అంతటినీ ధరణి పోర్టల్‌లోకి బదిలీ చేశారు. ఈ ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను టెండర్ ప్రక్రియ ద్వారా ఐఎల్ఎఫ్ఎస్ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ధరణి అందుబాటులోకి వచి్చనా.. 2020లో ధరణి అందుబాటులోకి వచ్చినా 2011 నుంచి 2018 వరకు రూపొందించిన పహాణీ రికార్డులు మాత్రం ఎన్ఐసీ వద్దనే ఉన్నాయి. ఈ డేటాను అటు రెవెన్యూ శాఖకు కానీ, ఇటు ధరణి పోర్టల్‌ను నిర్వహించే ఐఎల్ఎఫ్ఎస్ అనే ప్రైవేటు సంస్థకు గానీ ఎన్ఐసీ ఇవ్వలేదు. తాము ఒకవేళ ఈ డేటాను బదిలీ చేస్తే తమ వద్ద ఉండే సర్వర్లలో ఇకపై వాటిని స్టోరేజీ చేయబోమని ఎన్ఐసీ తేల్చి చెప్పింది. దీనికి ప్రభుత్వం అంగీకరించలేదు. డేటాను బదిలీ చేయడంతో పాటు ఎన్ఐసీ సర్వర్లలో స్టోర్ చేయా లని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సర్వర్ల సమస్య తలెత్తదని వాదించింది. ఈ వాదనను పట్టించుకోని ఎన్ఐసీ ఇప్పటివరకు 2011–18 మధ్య తయారు చేసిన ఆన్లైన్ పహాణీ రికార్డులను ప్రభుత్వానికి ఇవ్వలేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆ మధ్య కాలంలో జరిగిన లావాదేవీల ద్వారా మారిన భూ యాజమాన్య హక్కుల వివరాలు అందుబాటులో లేకుండా పోయాయని అంటున్నా యి. ఈ రికార్డులు అందుబాటులో లేకపోవడంతో సదరు భూములపై యాజమాన్య హక్కులను నిర్ధారించి టైటిల్ క్లియరెన్స్ ఇవ్వలేకపోతున్నామని రెవెన్యూ శాఖకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఇక బ్యాంకులు అప్పులు ఇవ్వాలన్నా, సివిల్ కోర్టుల్లోని కేసులు తేలాలన్నా గత 13 ఏళ్ల పహాణీ రికార్డులను ఆధారంగా తీసుకుంటాయని, ఇప్పడు ఆ రికార్డులు లేకపోవడంతో ఇ బ్బందులు వస్తున్నాయని రెవెన్యూ వర్గాలంటు న్నాయి. చాలావరకు కోర్టు కేసులు పెండింగ్‌లోనే ఉంటుండగా, కొన్ని సందర్భాల్లో యజమాని సైతం తన భూములపై హక్కును కోల్పోవాల్సి వస్తోంది. 2011–18 మధ్య రూపొందించిన ఆన్లైన్ పహాణీలను త్వరగా అందుబాటులోకి తేవ డం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గందరగోళానికి తెరదింపాలని రెవెన్యూ వర్గాలు కోరుతున్నాయి. -
అనంత మెడికల్ కళాశాల గల్లంతు
జేఎన్టీయూ: ఎంబీబీఎస్ జాతీయ కోటా సీట్ల కౌన్సెలింగ్ ప్రక్రియ గందరగోళంగా మారింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) తప్పిదం కారణంగా సీట్ల భర్తీ ప్రక్రియలో వెబ్సైట్లో అనంతపురం మెడికల్ కళాశాల గల్లంతైంది . ఫలితంగా విద్యార్థులు ఆన్లైన్ ఆప్షన్ ఇచ్చుకునే అవకాశం లేకుండా పోయింది. మరో వైపు తొలి దఫా ఆప్షన్ల నమోదు గడువు మంగళవారంతో ముగియనుంది. అనంతపురం మెడికల్ కళాశాలలో 100 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నప్పటికీ ... తొలి దఫా వెబ్ఆప్షన్లు ఇవ్వడానికి అవకాశం లేకుండా పోవడంతో ప్రతిభావంతులు కళాశాలలో అడ్మిషన్ పొందకుండా పోయే ప్రమాదం నెలకొంది. నీట్ ఆధారంగా భర్తీ ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో ఈ ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ కోటా (నేషనల్ కోటా) విధానం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ర్యాంకుల ఆధారంగా తొలుత జాతీయ కోటా సీట్లను భర్తీ చేస్తారు. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ( ఎంసీసీ) ఈ ప్రక్రియను చేపడుతోంది. ఎన్ఐసీ ఆధ్వర్యంలో సాంకేతిక ప్రక్రియ , రాష్ట్రాల వారీ కాలేజీలు, సీట్ల వివరాలు నమోదు చేస్తుంది. మంగళవారం వరకు సీట్ల ఎంపిక కోసం ఆన్లైన్ ఆప్షన్‌కు ఎంసీసీ అవకాశం కల్పించింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంప్రదించకుండానే ఎన్ఐసీ నేరుగా వివరాలు నమోదు చేయడంతో ఆన్లైన్లో మెడికల్ కళాశాలలు వివరాలు, సీట్ల వివరాల వెల్లడిలో తప్పిదాలు చోటు చేసుకున్నాయి. రెండో విడతలోనే సీట్ల భర్తీ తొలి దఫా వెబ్ ఆప్షన్ల ప్రక్రియలో తప్పిదాలకు ఆస్కారం ఏర్పడడంతో వాటిని సవరణ చేసి రెండో దఫా కౌన్సెలింగ్‌కు అవకాశం కల్పించనున్నారు. ఇందుకు ఎన్ఐసీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రెండో విడత కౌన్సెలింగ్‌లో అనంతపురం మెడికల్ కళాశాలను జాబితాలో చేర్చనున్నారు. జులై 6 నుంచి రెండో విడుత ఎంబీబీఎస్ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు. తొలి విడతలో సీట్ల కేటాయింపునకు సంబంధించి ఈ నెల 22న జాబితా వెల్లడించనున్నారు. ప్రతిభావంతులకు నష్టం నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వారు రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల వివరాలు, యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను తీసుకోవాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. అయినా మేము వివరాలన్నింటినీ నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు ఈ నెల 6కు ముందే పంపాం. ఇదే నెల 14న నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కూ ఫిర్యాదు చేశాం. అయినా తొలి దఫాలో ఆన్లైన్ వెబ్ఆప్షన్స్లో అనంతపురం మెడికల్ కళాశాలను చూపలేదు. ప్రతిభావంతులు, అనంతపురం మెడికల్ కళాశాలలోనే చదవాలనుకునే వారికి అవకాశం లేకుండా పోయే ప్రమాదం నెలకొంది. రెండో దఫా కౌన్సెలింగ్‌లో ప్రతిభావంతులు ఆప్షన్ తీసుకునే అవకాశం ఉండదు.– ప్రొఫెసర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్, అనంతపురం -
రాష్ట్ర ప్రభుత్వ ‘ఈ-మెయిల్’
♦ పాలసీని విడుదల చేసిన ఐటీ శాఖ ♦అధికారులు ఇకపై ప్రైవేటు ♦ ఈ మెయిల్స్ వాడకూడదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఈ-మెయిల్ పాలసీని ఐటీ శాఖ విడుదల చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలతో ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వపరంగా ఇతర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపేటప్పుడు, అధికారుల మధ్య సంప్రదింపులు జరిపేటప్పుడు ప్రైవేటు ఈ-మెయిల్‌ను వినియోగించకుండా ప్రభుత్వ ఈ-మెయిల్‌నే వినియోగించేలా ఈ విధానాన్ని తెచ్చింది. ప్రైవేటు ఈ-మెయిల్స్ ద్వారా సమాచారం పంపడం వల్ల భద్రతా సమస్యలు ఉండటంతో పూర్తి రక్షణ కలిగిన ప్రభుత్వ ఈ-మెయిల్‌ను అనుసరించాలని కేంద్రం స్పష్టం చేయడంతో రాష్ట్రం ఈ విధానాన్ని తెచ్చింది. ఇప్పటివరకు ప్రభుత్వ ఈ-మెయిల్ వ్యవస్థ ఉన్నప్పటికీ అది తప్పనిసరి కాక పోవడంతో అధికారులు, వివిధ శాఖలు జీమెయిల్ వంటి ప్రైవేటు ఈ-మెయిల్‌ను వినియోగిస్తున్నారు. ఇకపై ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వ కార్యకలాపాల్లో, సంప్రదింపుల్లో ప్రైవేటు ఈ-మెయిల్‌ను వినియోగించడానికి వీల్లేదు. దీని నిర్వహణకు నేషనల్ ఇన్ఫార్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) నోడల్ ఏజెన్సీ గా వ్యవహరిస్తుంది. శాఖలు, అధికారుల హోదాను బట్టి ఎన్ఐసీ యూజర్ ఐడీని క్రియేట్ చేసి ఇస్తుంది. అధికారులు, మంత్రులకు అధికారిక ఈ-మెయిల్‌తోపాటు కావాలనుకుంటే వ్యక్తిగత ఈ-మెయిల్ అకౌంట్లను ఇస్తారు. అయితే ప్రభుత్వ, అధికారిక కార్యకలాపాలు, సంప్రదింపులు, ఫైల్ ప్రొసీజర్ అంతా అధికారిక మెయిల్ ద్వారా జరపాలి. డిజిటల్ సంతకంతో కూడిన ఈ-మెయిల్‌ను ఇస్తారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఈ విధానాన్ని కచ్చితంగా పాటించాలి. ఇందులో వన్‌టైమ్ పాస్వర్డ్ విధానం ఉంటుంది. యూజర్ వినతిని బట్టి ఈ-మెయిల్‌ను క్రియేట్ చేసి ఇస్తారు. హోదా వింగ్ శాఖను పేర్కొంటూ ్ట్ఛ్చజ్చ్చ.జౌఠి.జీ పేరుతో క్రియేట్ చేసి ఇస్తారు. ఎవరైనా అధికారికి ఇవ్వాలంటే ముందు ఠట్ఛటజీఛీః్ట్ఛ్చజ్చ్చ.జౌఠి.జీ పేరుతో ఇస్తారు. వీటికి సంబంధించిన మార్గదర్శకాలు, పాస్వర్డ్ పాలసీ వివరాలు ఠీఠీఠీ.జ్టీ. ్ట్ఛ్చజ్చ్చ.జౌఠి.జీ/్ఛఝ్చజీఞౌజీఛిడ/జఠజీఛ్ఛీజ్ఛీట వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. -
అప్డేట్ అవ్వండయా!
♦ కొత్త సమాచారం కరువు ♦ ఉప ముఖ్యమంత్రికి దక్కని చోటు ♦ ఎంపీ, ఎమ్మెల్యేలదీ ఇదే పరిస్థితి ♦ తెలంగాణ రాష్ట్రం ప్రస్తావనే లేదు ♦ నిద్రావస్థలో ఎన్ఐసీ విభాగం ♦ పట్టించుకోని కలెక్టర్ కరుణ సాక్షి ప్రతినిధి, వరంగల్ : ప్రపంచం మారిపోతోంది. ఇప్పుడు అంతా టెక్నాలజీ మయమే. ఏది తెలుసుకోవాలన్నా.. చూడాలన్నా అన్ని కంప్యూటర్‌తోనే. ప్రభుత్వాలు ఇప్పుడు ఇదే పంథాలో వెళ్తున్నాయి. రేషన్‌కార్డు, పింఛన్లు, స్కాలర్షిప్, ఓటరు నమోదు నుంచి గ్యాస్ బుకింగ్ వరకు అన్ని ఆన్లైన్లోనే. కొత్త టెక్నాలజీ ప్రకారం మారుతున్న విధానాలకు అనుగుణంగా ప్రజలు సాంకేతిక అవగాహన పెంచుకోవాలని ప్రభుత్వ పెద్దలు సూచిస్తున్నారు. అధికారులు మరో ముందడుగు వేసి అన్ని ఆన్లైన్లోనే ఉన్నాయని చెబుతున్నారు. ప్రభుత్వ భూములు, ఫిర్యాదులు, పిటిషన్లు, తాజాగా ఓటరు నమోదుతో ఆధార్ కార్డు అనుసంధానం అంతా ఇంటర్నెట్లోనే జరుగుతుందంటున్నారు. దీనికోసం ప్రజలు సిద్ధం కావాలని అధికారులు పదేపదే చెబుతున్నారు. ఇలా ప్రజలకు సూచనలు ఇస్తున్న జిల్లా అధికార యంత్రాంగం.. ఈ విషయంలో అప్డేట్ కావడం లేదు. అధికారులు సాంకేతికంగా ముందుకు కదలడంలేదని చెప్పడానికి అధికారిక వెబ్సైట్ సాక్షిగా నిలుస్తోంది. జిల్లా సమాచారం లేదు.. ప్రభుత్వ పరంగా ప్రతి జిల్లాకు ఒక అధికారిక వెబ్సైట్ ఉంటుంది. మన జిల్లాకు ఠీఠీఠీ.ఠ్చీట్చజ్చ.జీఛి.జీ వెబ్సైట్ ఉంది. జిల్లాకు సంబంధించిన ప్రతి అంశం ఇందులో ఉండాలనే ఉద్దేశంతో వెబ్‌సైట్‌ను రూపొందించారు. జిల్లా యంత్రాంగం ఇచ్చే సమాచారంతో జాతీయ సాంకేతిక కేంద్రం(ఎన్ఐసీ) జిల్లా విభాగం వారు ఈ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తుంటారు. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో జిల్లా వెబ్సైట్ తీరు అధ్వానంగా ఉంది. జిల్లాకు సంబంధించిన కొత్త సమాచారం అనేదే కనిపించడంలేదు. ఎప్పుడో ఏళ్లనాటి సమాచారమే ఉంది. జిల్లాకు ఉండే అధికారిక వెబ్సైట్లో కొత్త విషయాలు ఏవీ ఉండవు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పది నెలలు గడిచినా కొత్త రాష్ట్రం గురించి ప్రస్తావనే లేదు. గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో గెలిచి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన వారు పేర్లు, ఫొటోలు జిల్లా వెబ్సైట్లో దర్శనమివ్వడం లేదు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత కీలకమైన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేరు, ఫొటో జిల్లా వెబ్సైట్లో కనిపించడం లేదు. గత సమాచారమే దిక్కు కొత్త ప్రజాప్రతినిధుల సమాచారం నమోదు చేయకపోగా గత ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా పని చేసిన వారి వివరాలు ఉన్నారుు. వీటిని ఇటీవలే తొలగించారు. ఇలాంటి ప్రాథమిక అంశాలతోపాటు జిల్లాకు సంబంధించిన కొత్త సమచారం ఏదీ వెబ్సైట్లో ఉండడం లేదు. జిల్లా యంత్రాంగం సమాచా రం ఇవ్వనిదే తాము కొత్త సమాచారం చేర్చలేమని ఎన్ఐసీ విభాగం వారు చెబుతున్నారు. ఎన్ఐసీ విభాగం వారు ఇదే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారా లేదా అనేది తెలియడంలేదు. కలెక్టర్ ఒక్కసారి అయినా జిల్లా వెబ్సైట్ చూస్తే కొంత మేరకైనా మెరుగుపడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా వెబ్సైట్లో పాత సమాచారం, తప్పుడు వివరాలు.. ♦ 2011 గణాంకాల ప్రకారం జిల్లా జనాభా 35,22,644. ఈ వివరాలు వచ్చి రెండేళ్లు కావస్తున్నా జిల్లా వెబ్సైట్లో 2001 ప్రకారం 32.46 లక్షల జనాభా అని మాత్రమే ఉంది. ♦ వరంగల్.. గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థగా మారింది. ఈ మేరకు కార్పొరేషన్ అన్ని చోట్ల బోర్డులను మార్చింది. ఈ వివరాలు వెబ్సైట్లో లేవు. ♦ గతేడాది జిల్లాలో 962 గ్రామ పంచాయతీలకు ఎన్నికలయ్యాయి. వెబ్సైట్లో ని సమాచారంలో మాత్రం జిల్లాలో 1014 పంచాయతీలు ఉన్నట్లుగా ఉంది. ♦ జనగామ, మహబూబాబాద్ మున్సిపాలిటీలకు.. భూపాలపల్లి, నర్సంపేట, పరకాల నగర పంచాయతీలకు గతేడాది ఎన్నికలు జరిగాయి. జిల్లా అధికారిక వెబ్సైట్లో జిల్లాలో రెండు మున్సిపాలిటీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ♦ వరంగల్ జిల్లాకు దేశ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చే సమ్మక్క-సారలమ్మ జాతర 2010లోనే జరిగినట్లు వెబ్సైట్లో పెట్టారు. ఆ ఏడాది జనవరి 27 నుంచి నాలుగు రోజులు జాతర జరిగిందని పేర్కొన్నారు. 2012, 2014 సంవత్సరాల్లో జాతర జరిగిన విషయం అధికారులు గుర్తించినట్లు లేదు. ♦అన్నింటి కంటే ముఖ్యంగా జిల్లా పరిపాలనలో కీలకమైన జేసీ ఎవరు అనే విషయం వెబ్సైట్లో కనిపించడంలేదు. ఇతర కీలక శాఖల అధికారులు సమాచారం లేదు. -
అర్హు లైన రైతులకు రుణమాఫీ
కాకినాడ సిటీ: అర్హులైన రైతులకు రూ.లక్షా 50 వేలు చొప్పున రుణమాఫీ వర్తింపచేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పష్టం చేశారు. ఈ అంశంపై బుధవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 5న రుణమాఫీకి సంబంధించిన రైతుల బ్యాంక్ రుణాల వివరాలు సీడీ రూపంలో ఎన్ఐసీకి అందజేయాలని బ్యాంక్ అధికారులను ఆదేశించారు. ఆ వివరాలు పరిశీలించి అర్హులైన రైతుల తుది జాబితాను ఈనెల 15వ తేదీలోగా తయారు చేయాల్సి ఉంటుందన్నారు. జాబితా రూపకల్పనలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అనర్హులు జాబితాలోకి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం రేషన్‌కార్డు, ఆధార్ డేటాలను అనుసంధానం చేస్తూ జాబితాలు రూపొందించాలన్నారు. రైతు పేరు, సర్వే నంబర్, పట్టాదారు పాస్ పుస్తకం నంబర్, ఆధార్, రేషన్‌కార్డు నంబర్ వంటి వివరాలతో 27 కాలాల నమూనా పూర్తి వివరాలను 5వ తేదీలోపు ఎన్ఐసీకి అందించాలన్నారు. వీడియో కన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం బ్యాంక్ అధికారులతో కలెక్టర్ నీతూ ప్రసాద్ సమీక్ష జరిపారు. జిల్లాలోని రైతుల ఆధార్, రేషన్ కార్డు డేటాల అనుసంధానంతో రెవెన్యూ గ్రామాల వారీగా రుణమాఫీకి సంబంధించిన వివరాలను వెంటనే అందించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎస్.జగన్నాథస్వామి, వ్యవసాయ శాఖ జేడీ విజయ్‌కుమార్, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్‌రాజు, వివిధ బ్యాంక్‌ల కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
కొత్తగా 'జాతీయ గుర్తింపు కార్డులు' రానున్నాయ్!
-
ప్రధాని నేతృత్వంలో నేడు ఎన్ఐసీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్సింగ్ నేతృత్వంలోని 148 మంది సభ్యులుగల జాతీయ సమగ్రతా మండలి (ఎన్ఐసీ) సమావేశం సోమవారం ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశంలో ముజఫర్‌నగర్ తరహా మత ఘర్షణల అణచివేత, మహిళల భద్రత అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. దేశంలో మత సామరస్యం పెంచేందుకు చర్యలు, ఈ దిశగా సామాజిక మీడియా బాధ్యత, మహిళల రక్షణకు చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలపై సభ్యులు చర్చించ నున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, లోక్‌సభ, రాజ్యసభలలో విపక్ష నేతలు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తదితరులు హాజరు కానున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత జరుగుతున్న ఎన్ఐసీ భేటీ రోజంతా కొనసాగనుంది.