న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని 148 మంది సభ్యులుగల జాతీయ సమగ్రతా మండలి (ఎన్‌ఐసీ) సమావేశం సోమవారం ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశంలో ముజఫర్‌నగర్ తరహా మత ఘర్షణల అణచివేత, మహిళల భద్రత అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. దేశంలో మత సామరస్యం పెంచేందుకు చర్యలు, ఈ దిశగా సామాజిక మీడియా బాధ్యత, మహిళల రక్షణకు చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలపై సభ్యులు చర్చించ నున్నారు.
ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, లోక్‌సభ, రాజ్యసభలలో విపక్ష నేతలు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తదితరులు హాజరు కానున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత జరుగుతున్న ఎన్‌ఐసీ భేటీ రోజంతా కొనసాగనుంది.