మూడేళ్లపాటు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
నాలుగేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ చేతికి భూ రికార్డుల నిర్వహణ
ఈ నెల 29తో ముగియనున్న టెరాసస్ కంపెనీ గడువు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూముల రికార్డులను నిర్వహిస్తున్న ధరణి పోర్ట ల్‌ను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ ఇన్ఫర్మే టిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ)కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ధరణి పోర్టల్‌ను నిర్వహిస్తున్న టెరాసస్ కంపెనీ గడువు ఈనెల 29తో ముగియనున్న నేపథ్యంలో రానున్న మూడేళ్లపాటు ఈ బాధ్యతను ఎన్‌ఐసీకి అప్పగిస్తు న్నట్లు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు.
టెరాసస్ నుంచి పోర్టల్ నిర్వహణ చేపట్టేందుకు నెల రోజుల సమ యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది నవంబర్ 30 నుంచి మూడేళ్లపాటు ధరణి పోర్టల్‌ను ఎన్‌ఐసీ అధికారికంగా నిర్వహించనుంది. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత 2020 అక్టోబర్ 29 నుంచి ఐఎల్‌ఎఫ్‌ఎస్ (ఆ తర్వాత టెరాసస్‌గా మారింది)కు రికార్డుల నిర్వహణ బాధ్యత అప్పగించగా నాలుగేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం పరిధిలో పనిచేసే ఎన్‌ఐసీకి తెలంగాణలోని భూముల రికార్డుల బాధ్యత అప్పగించడం గమనార్హం.
ఈ మార్పుపై ఈ నెల 26న జరిగే కేబినెట్ భేటీలోనూ చర్చించనున్నట్లు రెవెన్యూ వర్గాలంటున్నాయి. దీంతోపాటు కొత్త రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్‌వోఆర్) చట్టం ముసాయిదాపైనా మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామా నికి రెవెన్యూ సిబ్బంది ఉండేలా మొత్తం 10,954 భూరక్షక్ (పేరు అధికారికంగా నిర్ణయించాల్సి ఉంది) పోస్టులకు కూడా మంత్రివర్గం అనుమతివ్వను ందని రెవెన్యూ వర్గాలు పేర్కొన్నాయి.
స్వదేశీ సంస్థ చేతుల్లోకి ‘ధరణి’: పొంగులేటి
ఇప్పటివరకు విదేశీ çకంపెనీ అయిన టెరాసస్ చేతిలో ఉన్న ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతను స్వదేశీ సంస్థ అయిన ఎన్‌ఐసీకి అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ పెద్దలు తొందరపాటు నిర్ణయాలతో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ కారణంగా తెలంగాణ రైతాంగం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొందని... తెలంగాణలోని 1.56 కోట్ల ఎకరాల భూమిని విదేశీ కంపెనీకి తాకట్టు పెట్టారని పొంగులేటి ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు భూరికా ర్డుల నిర్వహణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థకు అప్పగించామని పేర్కొన్నారు. తద్వారా రాష్ట్రంలోని 71 లక్షల మంది రైతుల ఖాతాల్లోని భూములకు రక్షణ ఏర్పడిందన్నారు. త్వరలోనే ధరణి సమస్యల నుంచి తెలంగాణ రైతాంగానికి విముక్తి కల్పిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment