భోపాల్: వ్యాపం కుంభకోణంలో ప్రమేయం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు సొంత పార్టీ నేతలు అండగా నిలిచారు.
మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షడు నంద్ కుమార్ ఆదివారం భోపాల్లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం శివరాజ్ను గంగా నదితో పోల్చారు. 'మా ముఖ్యమంత్రి గంగా నది అంతటి పవిత్రమైనవారు. కావాలనే విపక్షాలు ఆయనపై బుదర జల్లుతున్నాయి. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఆయన కడిగిన ముత్యంలా బయటికొస్తారు' అని నంద్ కుమార్ వ్యాఖ్యానించారు.
'మా సీఎం గంగలా స్వచ్ఛమైన వ్యక్తి'
Published Sun, Jul 12 2015 6:32 PM | Last Updated on Sun, Sep 3 2017 5:23 AM
Advertisement
Advertisement