
సాక్షి, ముంబై : బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఇండిగో ప్రమోటర్ల మధ్య విభేదాలు రచ్చకెక్కిన నేపథ్యంలో కంపెనీ సీఈవో రనుంజాయ్ దత్తా స్పందించారు. బుధవారం ఆయన ఇండిగో ఉద్యోగులకు ఒక లేఖ రాశారు. ఇవి కేవలం ప్రమోటర్ల మధ్య విభేదాలు మాత్రమేనని, దీనికి ఇండిగోకు ఎలాంటి సంబంధ లేదనీ, ఇండిగో కార్యకలాపాలపై ఈ వివాదం ఎలాంటి ప్రభావం ఉండదని వివరణ ఇచ్చారు. అలాగే ఎయిర్లైన్స్ మిషన్, డైరెక్షన్, గ్రోత్ స్ట్రాటజీలో ఎలాంటిమార్పు ఉండదని స్పష్టం చేశారు. సంస్థ కార్యకలాపాలు, వృద్ధి పైనే దృష్టి సారించడం ప్రస్తుతం ముఖ్యమన్నారు.
ప్రమోటర్ల మధ్య విభేదాలుతో ఉద్యోగులకు, ఎయిర్లైన్స్‌కు ఏమీ నష్టం జరగదని సీఈవో ప్రకటించారు. శక్తిసామర్థ్యాల మేరకు తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నానని, ఉద్యోగుల నుంచి కూడా ఇదే ఆశిస్తున్నానని చెప్పారు. ఈ సదర్భంగా టార్గెట్లను రీచ్ అయ్యేందుకు అంకితభావంతో కృషి చేస్తున్న ఉద్యోగులందరికీ ఆయన ధన్యవాదాలు అన్నారు.
మరోవైపు ఇండిగోలో సంక్షోభంముదిరిందన్న వార్తలతో ఇన్వెస్టర్లు ఇండిగో షర్లలో అమ్మకాలకు దిగారు. దీంతో ఇండిగో షేర్లు 11 శాతానికి పైగా పతనమమ్యాయి. అమ్మకాల సెగతో సంస్థ మార్కెట్ క్యాప్ రూ. 6423 కోట్ల సంపద ఆవిరైపోయింది. ఒక దశలో 19 శాతానికి పైగా నష్టపోయి, గత మార్చి తర్వాత తొలిసారి ఇంత భారీ నష్టాలను మూటగట్టకుంది. ముగింపులో స్వల్పంగా కోలుకున్నప్పటికీ, 2016 జనవరి తర్వాత ఇండిగోకు ఇదే అతి పెద్ద పతనమని ఎనలిస్టులు చెబుతున్నారు. కాగా ప్రమోటర్లు రాకేష్ గాంగ్వాల్, రాహుల్‌భాటియా మధ్య విభేదాల నేపథ్యంలో జోక్యం చేసుకోవాల్సిందిగా గాంగ్వాల్ మార్కెట్ రెగ్యులేటరీ సెబీనికోరిన సంగతి తెలిసిందే. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఇండిగో సంస్థను సెబీ కోరింది.
Comments
Please login to add a commentAdd a comment