న్యూఢిల్లీ: ఇండిగో బ్రాండ్ విమానయాన సేవల కంపెనీ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) తొలిసారి రూ. లక్ష కోట్లను తాకింది. వెరసి దేశీయంగా ఈ మైలురాయిని చేరిన తొలి ఎయిర్‌లైన్స్ కంపెనీగా చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది ఇప్పటివరకూ షేరు 30 శాతంపైగా దూసుకెళ్లడంతో కంపెనీ తాజా ఫీట్‌ను సాధించింది. ఇదే కాలంలో సెన్సెక్స్ 5 శాతమే బలపడటం గమనార్హం! బుధవారం స్టాక్ ఎక్సే్ఛంజీలలో ఇండిగో షేరు 3.6 శాతం జంప్‌చేసింది. బీఎస్‌ఈలో రూ. 2,620కు చేరగా.. ఎన్‌ఎస్‌ఈలో రూ. 2,621 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో రూ. 2,634 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది.
వెరసి కంపెనీ మార్కెట్ విలువ రూ. 1,01,007 కోట్లను అధిగమించింది. సోమవారం ఎయిర్‌బస్ నుంచి 500 విమానాల కొనుగోలుకి ఆర్డర్ జారీ చేసింది. తద్వారా ఎయిర్‌బస్ చరిత్రలోనే భారీ కాంట్రాక్టుకు తెరతీసింది. దీర్ఘకాలిక వృద్ధిలో భాగంగా భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించడంతో ఇండిగో కౌంటర్ జోరందుకుంది. ఇందుకు సరికొత్త గరిష్టాలకు చేరిన స్టాక్ మార్కెట్లు సైతం దోహదపడినట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశీయంగా అతిపెద్ద విమానయాన కంపెనీగా నిలుస్తున్న ఇండిగో అంతర్జాతీయంగా విస్తరించేందుకూ ప్రణాళికలు అమలు చేస్తోంది. దేశీయంగా కంపెనీ మార్కెట్ వాటా 61 శాతానికిపైగా నమోదుకావడం విశేషం!
Comments
Please login to add a commentAdd a comment