Aviation market
-
సామాన్యుడు విమానాల్లో వెళ్లాలన్నదే మోదీ కల
సాక్షి, హైదరాబాద్: హవాయి చెప్పులు వేసుకునే సామాన్య వ్యక్తి సైతం విమానాల్లో ప్రయాణించాలన్నదే పీఎం నరేంద్రమోదీ కల అని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. ఉడాన్ పథకంతో సామాన్యులకు కూడా విమాన ప్రయాణాన్ని పీఎం అందుబాటులోకి తీసుకు వచ్చారని గుర్తు చేశారు.గురువారం బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2047 నాటికి అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా భారతదేశం అవతరిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మూడవ అతిపెద్ద దేశీయ మార్కెట్‌గా, ఏడవ అతిపెద్ద అంతర్జాతీయ మార్కెట్‌గా భారత్ అవతరించిందని జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. 2047 నాటికి విమానయాన రంగంలో 20 ట్రిలియన్ డాలర్ల వృద్ధిని సాధించే దిశగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. దేశంలో 500 కొత్త ఇండిగో విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. మానవవనరుల కోసం పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఎయిర్ క్రాప్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ కోర్సులను బోధించే జీఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టండి: ఇస్లాం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ మీడియా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా వర్క్‌షాప్‌ను మాజీ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి జాఫర్ సయ్యద్ ఇస్లాం ప్రారంభించారు. పార్టీ బలోపేతంతో సహా పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, విధివిధానాలపై కూలంకుషంగా చర్చించడంతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలపై ఎప్పటికప్పుడు కౌంటర్ ఎటాక్ చేసేలా, మరింత యాక్టివ్‌గా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన గురించి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ మెజారిటీ సీట్లు గెలిపించుకునేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, జాతీయ ఎస్సీ మోర్చా కార్యదర్శి ఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్‌గ్లోబ్ విలువ రూ. లక్ష కోట్లు
న్యూఢిల్లీ: ఇండిగో బ్రాండ్ విమానయాన సేవల కంపెనీ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) తొలిసారి రూ. లక్ష కోట్లను తాకింది. వెరసి దేశీయంగా ఈ మైలురాయిని చేరిన తొలి ఎయిర్‌లైన్స్ కంపెనీగా చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది ఇప్పటివరకూ షేరు 30 శాతంపైగా దూసుకెళ్లడంతో కంపెనీ తాజా ఫీట్‌ను సాధించింది. ఇదే కాలంలో సెన్సెక్స్ 5 శాతమే బలపడటం గమనార్హం! బుధవారం స్టాక్ ఎక్సే్ఛంజీలలో ఇండిగో షేరు 3.6 శాతం జంప్‌చేసింది. బీఎస్ఈలో రూ. 2,620కు చేరగా.. ఎన్ఎస్ఈలో రూ. 2,621 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో రూ. 2,634 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. వెరసి కంపెనీ మార్కెట్ విలువ రూ. 1,01,007 కోట్లను అధిగమించింది. సోమవారం ఎయిర్‌బస్ నుంచి 500 విమానాల కొనుగోలుకి ఆర్డర్ జారీ చేసింది. తద్వారా ఎయిర్‌బస్ చరిత్రలోనే భారీ కాంట్రాక్టుకు తెరతీసింది. దీర్ఘకాలిక వృద్ధిలో భాగంగా భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించడంతో ఇండిగో కౌంటర్ జోరందుకుంది. ఇందుకు సరికొత్త గరిష్టాలకు చేరిన స్టాక్ మార్కెట్లు సైతం దోహదపడినట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశీయంగా అతిపెద్ద విమానయాన కంపెనీగా నిలుస్తున్న ఇండిగో అంతర్జాతీయంగా విస్తరించేందుకూ ప్రణాళికలు అమలు చేస్తోంది. దేశీయంగా కంపెనీ మార్కెట్ వాటా 61 శాతానికిపైగా నమోదుకావడం విశేషం! -
పెద్ద విమానాలు సమకూర్చుకోవాలి
న్యూఢిల్లీ: వచ్చే దశాబ్ద కాలంలో భారత ఏవియేషన్ మార్కెట్ రెండంకెల స్థాయిలో వృద్ధి చెందనున్న నేపథ్యంలో దేశీ ఎయిర్‌లైన్స్ సుదీర్ఘ ప్రయాణాల విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సూచించారు. ఇందుకోసం మరిన్ని పెద్ద విమానాలను (వైడ్–బాడీ) సమకూర్చుకోవాలని పేర్కొన్నారు. ముంబై నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు గురువారం ఎయిరిండియా డైరెక్ట్ ఫ్లయిట్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘దాదాపు 86 అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ .. భారత్‌కు విమానాలు నడిపిస్తున్నాయి. కానీ మన దగ్గర్నుంచి కేవలం అయిదు సంస్థలకే అంతర్జాతీయ రూట్లలో సర్వీసులు ఉన్నాయి. అయితే, ఈ అయిదింటికీ 36 శాతం మార్కెట్ వాటా ఉంది. మనం అంతర్జాతీయ ప్రయాణికుల ట్రాఫిక్‌పై దృష్టి పెట్టాలి. ఇందులో భాగంగానే సుదీర్ఘ రూట్ల మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మరిన్ని వైడ్ బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకోవాలని మన ఎయిర్‌లైన్స్‌ను కోరుతున్నాను‘ అని మంత్రి చెప్పారు. టాటా గ్రూప్‌లో భాగంగా ఉన్న ఎయిరిండియా.. సుదీర్ఘ రూట్లలో మరింతగా విస్తరించగలదని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2023 తొలినాళ్లలో ఎయిరిండియా.. ముంబై నుంచి న్యూయార్క్, ప్యారిస్, ఫ్రాంక్‌ఫర్ట్‌కు కూడా ఫ్లయిట్స్ ప్రారంభించనుంది. మరోవైపు, 2013–14లో 6.3 కోట్లుగా ఉన్న విమాన ప్రయాణికుల సంఖ్య 2019–20లో 14.4 కోట్లకు చేరిందని ఆయన తెలిపారు. గడిచిన ఎనిమిదేళ్లలో ఎయిర్‌పోర్టులు, హెలిపోర్టులు, వాటర్‌డ్రోమ్‌ల సంఖ్య 145కి పెరిగిందని చెప్పారు. -
కరోనా కాటు..రూ.15లక్షల కోట్లు ఆవిరి
బోస్టన్: విమానయాన పరిశ్రమను కరోనా గట్టిగానే దెబ్బకొట్టింది. 2020 నుంచి 2022 మధ్య పరిశ్రమకు సుమారు 201 బిలియన్ల మేర నష్టాలు (రూ.15 లక్షల కోట్లు) ఎదురుకావచ్చని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) పేర్కొంది. పరిశ్రమ 2023లోనే తిరిగి లాభాల్లోకి ప్రవేశించొచ్చని ఐఏటీఏ డైరెక్టర్ జనరల్ విలియమ్ ఎం వాల్ష పేర్కొన్నారు. ‘‘సంక్షోభం పతాక స్థాయిని దాటేశాం. తీవ్రమైన అంశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. కోలుకునే మార్గం కనిపిస్తోంది’’అని వాల్ష అన్నారు. ఐఏటీఏ 77వ వార్షిక సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడారు. ‘‘2021లో నష్టాలు 52 బిలియన్ డాలర్ల మేర ఉండొచ్చు. 2020లో నష్టాలు 138 బిలియన్ డాలర్లతో పోలిస్తే చాలా వరకు తగ్గినట్టే. 2022లో నష్టాలు 12 బిలియన్ డాలర్లకే పరిమితం కావచ్చు. మొత్తం మీద కరోనా కారణంగా పరిశ్రమకు వాటిల్లే నష్టం 201 బిలియన్ డాలర్లుగా ఉంటుంది’’ అని విల్లీ వివరించారు. దేశీయంగా ఎయిర్‌లైన్స్ సంస్థలు సైతం తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా గతేడాది లాక్డౌన్లతో పడిపోయిన ట్రాఫిక్ (ప్రయాణికుల రద్దీ) క్రమంగా 70 శాతానికి కోలుకుంది. అయినప్పటికీ కరోనాకు ముందునాటితో పోలిస్తే ప్రస్తుతం భారత్ నుంచి 20 శాతం మేరే అంతర్జాతీయ సర్వీసులు నడుస్తున్నాయి. 2021లో అంతర్జాతీయంగా ఏవియేషన్ పరిశ్రమ ఆదాయం 26.7 శాతం వృద్ధితో 472 బిలియన్ డాలర్లుగా ఉంటుందని ఐఏటీఏ పేర్కొంది. 2022లో 40 శాతం వృద్ధి చెంది 658 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. చదవండి: భారత్‌కు తొలిసారి తాలిబన్ల లేఖ: విమానాలు నడపాలని విజ్ఞప్తి -
అతి పెద్ద ఏవియేషన్ మార్కాట్గా ఇండియా
-
మూడో అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్‌గా భారత్!
న్యూఢిల్లీ: భారత్ 2026 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్ గల దేశంగా అవతరిస్తుందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) అంచనా వేసింది. ఒక దేశానికి వచ్చే వెళ్లే విమాన ప్రయాణికుల సంఖ్యనే ఇక్కడ ఏవియేషన్ మార్కెట్‌గా పరిగణలోకి తీసుకున్నాం. ఐఏటీఏ ప్రకారం.. ప్రపంచంలో అతి పెద్ద ఏవియేషన్ మార్కెట్ గల దేశాల్లో ఇండియా 9వ స్థానంలో ఉంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. 2029 నాటికి చైనా అమెరికాను వెన క్కు నెట్టి అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్ గల దేశంగా అవతరించనుంది. ఇక మనం 2026 నాటికి యూకేను వెనక్కు నెట్టి మూడో స్థానంలో నిలువనున్నాం. టాప్-10లోకి ఇండోనేసియా అడుగుపెట్టనుంది. ఇండియాలోని విమాన ప్రయాణికుల సంఖ్య 2035 నాటికి 44.2 కోట్లకు చేరనుంది. ఇదే సమయంలో ప్రస్తుతం 380 కోట్లుగా ఉన్న మొత్తం అంతర్జాతీయ విమాన ప్రయాణికుల సంఖ్య 720 కోట్లకు పెరగనుంది. విమాన ప్రయాణికుల రద్దీ 23 శాతం వృద్ధి న్యూఢిల్లీ: దేశీ విమాన ప్రయాణికుల రద్దీ సెప్టెంబర్‌లో 23.4 శాతంగా నమోదయ్యింది. వివిధ విమానయాన కంపెనీలు ఈ నెలలో మొత్తంగా 82.3 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. ఇండిగో 40 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానంలో జెట్ ఎయిర్వేస్ (16.2 శాతం), ఎయిర్ ఇండియా (14.7 శాతం), స్పైస్‌జెట్ (12.5%) వంటి తదితర కంపెనీలు ఉన్నాయి. ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ గణాంకాల ప్రకారం.. గతేడాది ఇదే నెలలో నమోదైన విమాన ప్రయాణికుల సంఖ్య 66.66 లక్షలుగా ఉంది. ఇక జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో విమానయానం చేసిన వారి సంఖ్య గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 5.9 కోట్ల నుంచి 7.2 కోట్లకు పెరిగింది. నేడు రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ విధి విధానాలు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రీజినల్ కనెక్టివిటీ స్కీమ్(ఉడాన్)కి సంబంధించిన తుది పూర్తి విధివిధానాలు శుక్రవారం వెల్లడికానున్నాయి. ఇదే జరిగితే సామాన్యులు రూ.2,500లతోనే (గంట ప్రయాణానికి) విమానయానం చేయవచ్చు. విమానయానాన్ని సామాన్యులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ ఏడాది జూలై 1న రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ ముసాయిదాను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. పౌరవిమానయాన మంత్రి అశోక్ గజపతి రాజు ఈ నెల 21న ఈ స్కీమ్‌కు సంబంధించిన తుది ప్రకటన చేసే అవకాశముంది. -
భారత్ ఏవియేషన్ మార్కెట్ విశ్వరూపం!
ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ అంచనా న్యూఢిల్లీ: భారత్ పౌర విమానయాన మార్కెట్ రానున్న కొద్ది సంవత్సరాల్లో ప్రపంచంలోని అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్లలో ఒకటిగా ఉద్భవించనుందని ఏయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) తన తాజా నివేదికలో అంచనావేసింది. పెరుగుతున్న విమానయాన ప్రయాణీకులు ఇందుకు కారణమని తెలిపింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో విమాన ప్రయాణీకులు గణనీయంగా పెరుగుతున్నట్లు నివేదిక తెలిపింది. విమాన ప్రయాణీకుల సంఖ్య పెరుగుదల విషయంలో భారత్, చైనా, కొరియాలోని పెద్ద కమర్షియల్ ఎయిర్‌పోర్ట్‌లు కీలకపాత్ర పోషించనున్నట్లు పేర్కొంది. నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలను చూస్తే... ⇔ విమానయాన మార్కెట్లో సంస్కరణలు, పటిష్ట ఆర్థిక ఫండమెంటల్స్ కలిసి భారత్‌లో ఈ రంగం గణనీయ వృద్ధికి దోహదపడుతోంది. ⇔ ఆసియా-పసిఫిక్‌లో జూన్‌లో విమాన ప్రయాణీకుల సంఖ్య 9.9 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే నెలలో ఈ వృద్ధి రేటు 8.8 శాతం. ⇔ 2016 తొలి 6 నెలల్లో అంతర్జాతీయ, దేశీయ ప్రయాణీకుల సంఖ్య 2015 ఇదే కాలంతో పోల్చిచూస్తే, 8.2% నుంచి 10.1%కి పెరిగింది. ⇔ చైనా, భారత్, కొరియాల విషయంలో ప్రయాణీకుల పెరుగుదల శాతాలు వరుసగా 12.1 శాతం, 17 శాతం, 14.1 శాతంగా ఉన్నాయి. ⇔ భారత్‌లో ఒక్క దేశీయ ప్రయాణీకుల సంఖ్య మొదటి ఆరు నెలల్లో 20.6 శాతం నమోదైంది. ⇔ ఢిల్లీ ఎయిర్పోర్ట్ ప్రయాణీకుల విషయంలో జూన్‌లో 21.5% వృద్ధి కాగా, వార్షికంగా 4.4%. ⇔ భారత్ విమానయాన సరకు రవాణా విషయంలో వృద్ధి 6 నెలల్లో దేశీయంగా 4.1%, అంతర్జాతీయంగా 10.5 శాతంగా నమోదైంది. ⇔ ప్రపంచ విమానాశ్రయాల సంఘమే ఏసీఐ. 1991లో ఏర్పాటయిన ఈ సంఘంలో 173 దేశాల్లో 1,853 ఎయిర్‌పోర్ట్‌లు నిర్వహిస్తున్న 592 సంస్థలకు సభ్యత్వం ఉంది.