ఇండిగో మరో నిర్వాకం: వీడియో వైరల్‌ | IndiGo staff manhandle a passenger at Delhi's Indira Gandhi International Airport | Sakshi
Sakshi News home page

ఇండిగో మరో నిర్వాకం: వీడియో వైరల్‌

Published Tue, Nov 7 2017 8:51 PM | Last Updated on Wed, Mar 20 2024 3:43 PM

ప్రముఖ బాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధుపట్ల అమర్యాదగా ప్రవర్తించిన ఘటన మరువక ముందే ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది బాగోతం మరోటి బయటపడింది. ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇండిగో సిబ్బంది ప్రయాణికుడిపై దౌర్జన్యానికి దిగడం కలకలం రేపింది. వీడియో సాక్షిగా ఈ నిర్వాకం బయటపడింది. ఇండిగో విమానాన్ని ఎక్కేందుకు వచ్చిన ప్రయాణీకుల పట్ల సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. కొందరు ప్రయాణీకులను ఇండిగో బస్‌ ఎక్కించుకోకుండా వెళ్లినందుకు ప్రశ్నించడంతో వివాదం చెలరేగింది. ప్రయాణీకులకు సర్ది చెప్పాల్సిన సిబ్బంది చెలరేగిపోయారు. ఈవైనాన్ని ప్రశ్నించిన పెద్దాయన పై పిడిగుద్దులు కురిపించారు. విచక్షణా రహితంగా లాగి పడేశారు. ఈ వ్యవహారంపై బాధితుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబందించిన వీడియో నెట్‌లో వైరల్‌గా మారింది. దీంతో దిగి వచ్చిన ఇండిగో యాజమాన్యం క్షమాపణ చెప్పింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement