న్యూఢిల్లీ: ఇంజిన్‌లలో లోపాల కారణంగా 11 ఎయిర్‌బస్ ఏ320 నియో (న్యూ ఇంజిన్ ఆప్షన్) విమానాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సేవల నుంచి తప్పించింది. వీటిలో 8 విమానాలు ఇండిగో సంస్థకు చెందినవి కాగా మరో మూడు గో ఎయిర్‌వి. ఈ 11 విమానాల్లోనూ ప్రాట్ అండ్ వైట్నీ సంస్థ తయారుచేసిన పీడబ్ల్యూ 1100 రకం ఇంజిన్లను అమర్చారు.
ఈ రకం ఇంజిన్లు తరచూ మొరాయిస్తున్నాయి. సోమవారం అహ్మదాబాద్ నుంచి లక్నో మీదుగా కోల్‌కతా వెళ్తున్న ఇండిగోకు చెందిన ఎయిర్‌బస్ ఏ320 నియో విమానం టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే అందులోని పీడబ్ల్యూ 1100 ఇంజిన్ పనిచేయడం మానేసింది. దీంతో 186 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆ విమానాన్ని వెంటనే అహ్మదాబాద్‌కు తీసుకొచ్చి ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment