air bus a 320
-
భారతీయ కంపెనీకి అంతర్జాతీయ కాంట్రాక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) తాజాగా ఎయిర్‌బస్ నుంచి కాంట్రాక్ట్ పొందింది. ఇందులో భాగంగా బీడీఎల్ సొంతంగా అభివృద్ధి చేసిన కౌంటర్ మెజర్స్ డిస్పెన్సింగ్ సిస్టమ్‌ను (సీఎండీఎస్) ఎయిర్‌బస్‌కు సరఫరా చేయనుంది. డీల్ విలువ సుమారు రూ.156 కోట్లు. బీడీఎల్ టెక్నికల్ డైరెక్టర్ ఎన్.పి.దివాకర్, ఎయిర్‌బస్ డిఫెన్స్, స్పేస్ ఎస్వీపీ అర్నల్ డిడియర్ డోమినిక్ ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేశారు. -
11 విమానాల సేవలకు సెలవు
న్యూఢిల్లీ: ఇంజిన్లలో లోపాల కారణంగా 11 ఎయిర్‌బస్ ఏ320 నియో (న్యూ ఇంజిన్ ఆప్షన్) విమానాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సేవల నుంచి తప్పించింది. వీటిలో 8 విమానాలు ఇండిగో సంస్థకు చెందినవి కాగా మరో మూడు గో ఎయిర్వి. ఈ 11 విమానాల్లోనూ ప్రాట్ అండ్ వైట్నీ సంస్థ తయారుచేసిన పీడబ్ల్యూ 1100 రకం ఇంజిన్లను అమర్చారు. ఈ రకం ఇంజిన్లు తరచూ మొరాయిస్తున్నాయి. సోమవారం అహ్మదాబాద్ నుంచి లక్నో మీదుగా కోల్‌కతా వెళ్తున్న ఇండిగోకు చెందిన ఎయిర్‌బస్ ఏ320 నియో విమానం టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే అందులోని పీడబ్ల్యూ 1100 ఇంజిన్ పనిచేయడం మానేసింది. దీంతో 186 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆ విమానాన్ని వెంటనే అహ్మదాబాద్‌కు తీసుకొచ్చి ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. -
మనోళ్ల కోసం వెళ్లిన విమానం
న్యూఢిల్లీ: గల్ఫ్ దేశం యెమెన్‌లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియా విమానం బయలు దేరింది. యెమెన్‌లో ఉద్రిక్తత, గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అక్కడ రాజకీయ అస్థిరత చోటుచేసుకుందని, భయానక పరిస్థితులను ఎదుర్కొంటున్నామని, తమను స్వదేశానికి తీసుకెళ్లాలని అక్కడి భారతీయులు కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతోపాటు యెమెన్ అధికారులు కూడా ఇదే విషయాన్ని చెప్పడంతో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రంగంలోకి దిగారు. యెమెన్ అధికారులతో చర్చలు జరిపి రోజుకు మూడు గంటలపాటు భారత విమానానికి అనుమతిని పొందారు. దీంతో అక్కడి వారిని వెనుకకు తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియా విమానం ఏ 320 సోమవారం ఉదయం 7.45గంటలకు అక్కడి సనా విమానాశ్రయానికి బయలు దేరింది. ఏ 320కి 180 మంది ప్రయాణీకుల సామర్ధ్యం ఉంది. ప్రస్తుతం ఇక్కడ మొత్తం 3,500 మంది భారతీయులు ఉండగా వీరిలో నర్సులే ఎక్కువగా ఉన్నారు. ఒకే సారి 1500మందిని తరలించగల భారీ నౌకను కూడా యెమెన్ పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సుష్మా స్వరాజ్ తెలిపారు. యెమెన్‌లో ప్రస్తుతం అన్ని విమానాశ్రయాలు మూతపడ్డాయి.