వరుస ఘటనల కలకలం: ఇండిగో విమానం క్యాబిన్‌లో పొగలు | Smoke On IndiGo Plane After Landing in Indore | Sakshi
Sakshi News home page

వరుస ఘటనల కలకలం: ఇండిగో విమానం క్యాబిన్‌లో పొగలు

Published Wed, Jul 6 2022 8:09 PM | Last Updated on Wed, Jul 6 2022 8:11 PM

Smoke On IndiGo Plane After Landing in Indore - Sakshi

న్యూఢిల్లీ: అసలే వర్షాకాలం. దీనికి తోడు పలు సంస్థల విమానాల్లో వెలుగులోకి వస్తున్న సాంకేతిక లోపాలు విమాన ప్రయాణీకుల్లో గుబులు రేపుతున్నాయి. ఇప్పటికే స్పైస్‌జెట్‌ విమానంలో వరుస ఘటనలు, విస్తారా విమానంలో ఇంజన్‌ ఫెయిల్‌ లాంటి అంశాలు ఆందోళన రేపాయి. ఇపుడిక ఈ జాబితాలో ఇండిగో చేరింది. ఇండోర్‌లో విమానాశ్రయంలో దిగిన తర్వాత ఇండిగో విమానంలో పొగలు వ్యాపించడం కలకలం రేపింది

రాయ్‌పూర్-ఇండోర్ ఇండిగో విమానం మంగళవారం ల్యాండ్ అయిన తర్వాత క్యాబిన్‌లో పొగలు వచ్చినట్లు ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బుధవారం తెలిపింది. అయితే ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారనీ,  ఈ ఘటనపై  విచారణ  చేపట్టామని డీజీసీఏ వెల్లడించింది. 

గత మూడు వారాల్లో అసాధారణ సంఘటనలు నమోదవుతున్నాయి. గో-అరౌండ్, మిస్డ్ అప్రోచ్‌లు, డైవర్షన్, మెడికల్ ఎమర్జెన్సీలు, ఎమర్జెనీ ల్యాండింగ్‌, క్యాబిన్లో పొగలు, వాతావరణం, టెక్నికల్, బర్డ్ హిట్‌లు ఉన్నాయి. కాగా గత 18 రోజుల్లో  ఎనిమిది సాంకేతిక లోపాల ఘటనల నేపథ్యంలో  డీజీసీఏ బుధవారం స్పైస్‌జెట్‌కి షో-కాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement