ఇండిగో నష్టం 1,062 కోట్లు | IndiGo Reports 1062 Cr Loss In September Quarter As Costs Rise | Sakshi
Sakshi News home page

ఇండిగో నష్టం 1,062 కోట్లు

Published Fri, Oct 25 2019 5:15 AM | Last Updated on Fri, Oct 25 2019 5:15 AM

IndiGo Reports 1062 Cr Loss In September Quarter As Costs Rise - Sakshi

న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ, ఇండిగో మాతృ కంపెనీ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌కు ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) సెప్టెంబర్ క్వార్టర్‌లో భారీగా నష్టాలు వచ్చాయి. గత క్యూ2లో రూ.652 కోట్ల నికర నష్టాలు రాగా ఈ క్యూ2లో ఈ నష్టాలు రూ.1,062 కోట్లకు పెరిగాయని ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ తెలిపింది. లీజు ఆస్తుల నిర్వహణకు సంబంధించి రూ.428 కోట్ల ఫారెక్స్‌ నష్టాలు, రూ.319 కోట్ల నిర్వహణ వ్యయాల కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని కంపెనీ సీఈఓ రొనొజాయ్‌ దత్తా చెప్పారు.

మొత్తం ఆదాయం రూ.6,514 కోట్ల నుంచి 31 శాతం వృద్ధితో రూ.8,540 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. గత క్యూ2లో రూ.987 కోట్లుగా ఉన్న స్థూల నష్టాలు ఈ క్యూ2లో రూ.1,032 కోట్లకు పెరిగాయని దత్తా చెప్పారు. ఈ క్యూ2లో ఒక్కో విమాన ప్రయాణికుడి నుంచి వచి్చన సగటు చార్జీ 9 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ఇక మొత్తం వ్యయాలు 28 శాతం పెరిగి రూ.9,572 కోట్లకు పెరిగాయని తెలిపారు. వృద్ధి ప్రణాళికలపైననే దృష్టి పెడుతున్నానమని, దేశీయంగా, అంతర్జాతీయంగా మరింతగా విస్తరిస్తామని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement