అలహాబాద్‌ బ్యాంక్‌ నష్టం 2,103 కోట్లు | Allahabad Bank Loss Widens To 2103 Crore In Q2 On Higher Bad Loans | Sakshi
Sakshi News home page

అలహాబాద్‌ బ్యాంక్‌ నష్టం 2,103 కోట్లు

Published Sat, Nov 9 2019 6:18 AM | Last Updated on Sat, Nov 9 2019 6:18 AM

Allahabad Bank Loss Widens To 2103 Crore In Q2 On Higher Bad Loans - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అలహాబాద్‌ నికర నష్టాలు ప్రస్తుత ఆర్థికసంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో మరింతగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.1,816 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ2లో రూ.2,103 కోట్లకు పెరిగాయని అలహాబాద్‌ బ్యాంక్‌ తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు పెరగడంతో నికర నష్టాలు ఈ రేంజ్‌లో పెరిగాయని పేర్కొంది. 

గత క్యూ2లో రూ.4,492 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.4,725 కోట్లకు పెరిగిందని పేర్కొంది. బ్యాంక్‌ మొండిబకాయిలు మరింత పెరిగాయి. గత క్యూ2లో రూ.27,236 కోట్లుగా ఉన్న స్థూల మొండి బాకీలు ఈ క్యూ2లో రూ.31,468 కోట్లకు పెరిగాయి. అయితే నికర మొండిబకాయిలు రూ.11,083 కోట్ల నుంచి రూ.8,502 కోట్లకు తగ్గాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement