
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ కొత్త సీఈవోను ఎంపిక చేసింది. రోనోజాయ్ దత్తాని సీఈవోగా నియమించామని కంపెనీ గురువారం ప్రకటించింది. అయిదేళ్ల పాటు ఆయన పదవిలో ఉంటారని వెల్లడించింది. అలాగే చైర్మన్‌గా మేలవీటిల్ దామోదరన్ నియామకాన్ని ఆమోదించింది. ఈ రెండు నియామకాలు జనవరి 24 నుంచి అమలులోకి వచ్చాయని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఎగ్జిక్యూటివ్‌గా, ఎయిర్ సహారా ప్రెసిడెంట్ పనిచేసిన దత్తా ఇటీవల ఇండిగో సంస్థలో ప్రిన్సిపల్ కన్సల్టెంట్‌గా జాయిన్ అయ్యారు. అయితే దత్తాకు సీఈవో పదవి కట్టబెట్టనున్నారనే అంచనాల నేపథ్యంలో గత నెలలో అప్పటి సీఈవో గ్రెగ్ టేలర్ రాజీనామా చేశారని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి.
Comments
Please login to add a commentAdd a comment