
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో).. రూ. 899కే దేశీ రూట్లలో టికెట్ అందిస్తోంది. ‘ది బిగ్ ఫ్యాట్ ఇండిగో సేల్’ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ ఆఫర్.. డిసెంబర్ 23 (సోమవారం) ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. నాలుగు రోజులపాటు కొనసాగే ఈ చౌక చార్జీల ఆఫర్ ఈ నెల 26న రాత్రి 11 గంటల 59 నిమిషాలకు ముగియనుంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు జరిగే ప్రయాణాలపై ఆఫర్ వర్తిస్తుంది. విదేశీ ప్రయాణానికి ప్రారంభ టికెట్ ధర రూ. 2,999గా కంపెనీ ప్రకటించింది. ఇండిగో వెబ్‌సైట్, యాప్‌ల ద్వారా బుకింగ్ చేసుకుంటే సౌలభ్య రుసుము (కన్వీనియన్స్) లేదని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment